Viral Video: రాత్రి అయ్యిందంటే ఆ ఇంటి బెడ్‌రూం పైకప్పు నుంచి వింత శబ్దాలు.. ఏముందాని పగలగొట్టి చూడగా..!

|

Jun 30, 2024 | 8:19 PM

ఆ ఇంటి పడక గదిలో రాత్రి అయ్యిందంటే భయం.. భయం.. ఎక్కడి నుంచో వింత శబ్ధాలు చెవులను మారుమోగిస్తాయి. ఆ శబ్ధం ఎక్కడి నుంచి వస్తుందా అని యజమాని పరిశీలించగా.. ఇంటి పైకప్పు నుంచి వస్తున్నట్లు గమనించాడు. ధైర్యం చేసి ఓ రోజు ప్లాస్టర్‌బోర్డ్ సీలింగ్ ఊడదీసి చూడగా.. అక్కడి దృశ్యం చూసి దాదాపు పిచ్చివాడైపోయాడు. ఎందుకంటే అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల కొద్ది..

Viral Video: రాత్రి అయ్యిందంటే ఆ ఇంటి బెడ్‌రూం పైకప్పు నుంచి వింత శబ్దాలు.. ఏముందాని పగలగొట్టి చూడగా..!
Bees In Bedroom Ceiling
Follow us on

ఆ ఇంటి పడక గదిలో రాత్రి అయ్యిందంటే భయం.. భయం.. ఎక్కడి నుంచో వింత శబ్ధాలు చెవులను మారుమోగిస్తాయి. ఆ శబ్ధం ఎక్కడి నుంచి వస్తుందా అని యజమాని పరిశీలించగా.. ఇంటి పైకప్పు నుంచి వస్తున్నట్లు గమనించాడు. ధైర్యం చేసి ఓ రోజు ప్లాస్టర్‌బోర్డ్ సీలింగ్ ఊడదీసి చూడగా.. అక్కడి దృశ్యం చూసి దాదాపు పిచ్చివాడైపోయాడు. ఎందుకంటే అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల కొద్ది తేనె టీగలు ఏళ్ల తరబడి ఉంటున్నాయి మరి. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

lochnesshoney పేరిట ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఈ వీడియోలో గది పైకప్పు లోపల భారీ తేనెటీ తుట్టులు ఉండటం చూడవచ్చు. BBC నివేదిక ప్రకారం.. ఈ తేనెటీగలు చాలా యేళ్లు ఈ ఇంట్లో నివాసం ఉంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే బెడ్‌రూమ్‌లలోని ప్లాస్టర్‌బోర్డ్ సీలింగ్‌లో 3 తేనెటీగల కాలనీలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో దాదాపు 60 వేల వరకు తేనే టీగలు ఉన్నాయి. మూడింటిలో 1,80,000 వరకు తేనెటీగలు ఉన్నాయి. రాత్రి పూట గదిలో వింత శబ్దాలు వినిపించాయని ఇంటి యజమాని మనవరాళ్లు చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

లోచ్ నెస్ హనీ కంపెనీకి చెందిన ‘బీకీపర్’ ఆండ్రూ కార్డ్‌ అనే వ్యక్తి అక్కడికి వచ్చి, వీటన్నింటినీ సురక్షింతంగా తరలించడంతో మిస్టరీకి తెరపడింది. ఇక్కడి తేనె టీగల ద్వారా.. వచ్చే ఏడాది తేనె ఉత్పత్తికి ఉపయోగించనున్నట్లు, అప్పటి వరకు వాటిని ఉంచడానికి కొత్త కాలనీలను ఏర్పాటు చేసినట్లు ఆండ్రూ కార్డ్ చెప్పాడు. బెడ్‌ రూంలోని 3 కాలనీలలో ఒకటి సుమారు 7 సంవత్సరాల నుంచి ఉందని, మిగిలిన రెండు కాలనీలు గత కొన్ని సంవత్సరాల కాలంలో నిర్మించబడినట్లు తెలిపాడు. ఆండ్రూ తన జీవితంలో ఇప్పటివరకు చేసిన అతిపెద్ద తేనెటీగల పెంపకం ఆపరేషన్ ఇదేనని కూడా చెప్పాడు. ఆండ్రూ థర్మల్ ఇమేజింగ్ కెమెరాతో తేనెటీగలను గుర్తించాడు. అయితే ప్లాస్టార్ బోర్డ్ కింద తాను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు ఉన్నాయని, తేనెటీగలు పెద్ద గుంపుగా ఉండటం వల్లనే ఈ స్థలాన్ని ఎంచుకున్నాయని ఆండ్రూ చెప్పాడు. తేనెటీగలు ఈ ఫ్లాట్ రూఫ్‌ను ఎంచుకోవడానికి మరొక కారణం అక్కడ ఇన్సులేషన్ లేకపోవడమే. వీటి ద్వారా ఏడాదికి 40 లీటర్ల తేనె ఉత్పత్తి చేయవచ్చని ఆయన అన్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.