శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుధీర్ సూరి అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని ఓ ఆలయం వెలుపల నిరసన తెలుపుతుండగా, గుంపులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి సూరిపై కాల్పులు జరిపినట్లు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ అరుణ్‌పాల్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఆలయం వెలుపల ఉన్న చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించాయి. ఆలయ నిర్వాహకుల నిర్లక్షానికి నిరసన తెలుపుతూ సూరి, మరి కొంతమంది కార్యకర్తలతో కలిసి ఆలయం ముందు బైఠాయించారు. నిరసన సమయంలో గుర్తుతెలియని దుండగుడు తుపాకితో సూరిపై దాడి చేసి, కాల్పులు జరిపాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని సందీప్ సింగ్‌గా గుర్తించారు. కాగా ఇప్పటికే సూరి హిట్‌లిస్ట్‌లో ఉన్నాడని, దీంతో పోలీసులు భారీ భద్రత కల్పించారు. గత జూలై నెలలో ఒక వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలాలతో దురుసుగా మాట్లాడాడని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడనే ఆరోపణలపై సూరిని పోలీసులు అరెస్టు చేశారు. సూరి అరెస్టుపై అప్పట్లో పలు వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి.
తాజా ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు తజిందర్ సింగ్ బగ్గా ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని, అధికార పార్టీ (ఆప్) నిర్లక్ష్యం మూలంగానే సూరి మృతి చెందాడని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.
Law and order collapsed in Punjab, Shiv sena leader Sudhir Suri injured in firing in Amritsar.
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 4, 2022
మరిన్ని క్రైం వార్తల కోసం క్లిక్ చేయండి.