మెట్రో కార్ షెడ్ తరలింపు నిర్ణయం దురదృష్టకరం: దేవేంద్ర ఫడ్నవీస్

ఆరే ప్రాంతంనుంచి మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును షిఫ్ట్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎవరినో సంతృప్తి పరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

మెట్రో కార్ షెడ్ తరలింపు నిర్ణయం దురదృష్టకరం: దేవేంద్ర ఫడ్నవీస్

Edited By:

Updated on: Oct 12, 2020 | 4:03 PM

ఆరే ప్రాంతంనుంచి మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును షిఫ్ట్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎవరినో సంతృప్తి పరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు అదనంగా మరో 4 వేల కోట్లు వ్యయమవుతాయని ఆయన చెప్పారు. ఖజానా మీద ఇంత భారం వేయాలా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఈయన గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. అయితే నాటి ప్రభుత్వ నిర్ణయం కారణంగా సుమారు మూడు వేల చెట్లను నరికివేయవలసి వస్తుందంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున నాడు నిరసన తెలిపారు. కాగా ప్రస్తుత సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. ఈ ఆరే ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్టుగా నిన్న ప్రకటించారు. మెట్రో కార్ షెడ్ ను మరో ప్రాంతానికి తరలిస్తామన్నారు.