Sheetal Nath Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల క్రితం మూత పడిన హిందూదేవాలయం.. చివరికి ముస్లింల సహకారంతో..

|

Feb 17, 2021 | 10:19 PM

Sheetal Nath Temple: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 31 ఏళ్ల క్రితం మూతబడిన శీతల్ నాథ్ దేవాలయం వసంత పంచమి సందర్భంగా తెరుచుకుంది.

Sheetal Nath Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల క్రితం మూత పడిన హిందూదేవాలయం.. చివరికి ముస్లింల సహకారంతో..
Follow us on

Sheetal Nath Temple: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 31 ఏళ్ల క్రితం మూతబడిన శీతల్ నాథ్ దేవాలయం వసంత పంచమి సందర్భంగా తెరుచుకుంది. సుదీర్ఘకాలం తరువాత తెరిచిన ఈ దేవాలయంలో అర్చకులు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, దాదాపు 31 ఏళ్ల తరువాత శీతల్ నాథ్ దేవాలయాన్ని తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలతో తరలివచ్చారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలాఉంటే.. ఉగ్రవాదుల కారణంగా మూత పడిన ఈ ఆలయాన్ని ఇన్నేళ్ల తెరిచేందుకు స్థానిక ముస్లిం ప్రజలే సహకరించడం విశేషం. అంతేకాదు.. స్థానిక ముస్లింలే స్వచ్చందంగా ముందుకు వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేశారు. ‘ఆలయాన్ని తెరిచేందుకు స్థానిక ముస్లిం సోదరులు సహకరించారు. వారి సహకారం వల్లే 31 ఏళ్ల క్రితం మూతపడిన శీతల్ నాథ్ ఆలయాన్ని ఇన్నేళ్లకు తెరవగలిగాం. ఆలయం తెరవడమే కాకుండా, ఆలయాన్ని ముస్లిం ప్రజలే శుభ్రం చేశారు. వారే పూజా సామాగ్రిని అందజేశారు. వారి ఇచ్చిన పూజా సామాగ్రితోనే శీతల్ నాథ్ ఉత్సవాలు నిర్వమించాం’ అని ఆలయ నిర్వాహకులు రవీందర్ రజ్దాన్ తెలిపారు.

Also read:

Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్

How to record WhatsApp voice calls Video: మీకు వాట్సప్ కాల్ ఎలా రికార్డ్ చేయాలో తెలుసా ..?