దాన్ని ‘అత్యాచారం’గా పరిగణించలేరట.. హైకోర్టు సంచలన తీర్పు..!

| Edited By:

May 25, 2020 | 2:42 PM

అత్యాచారంపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని

దాన్ని అత్యాచారంగా పరిగణించలేరట.. హైకోర్టు సంచలన తీర్పు..!
Follow us on

అత్యాచారంపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఆ రాష్ట్ర న్యాయస్థానం తెలిపింది. ‘అన్ని సన్నిహిత సంబంధాల విషయాల్లో అత్యాచార చట్టాలను ఉపయోగించలేము. అందులోనూ మహిళ అంగీకారంతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడాన్ని అత్యాచారంగా అస్సలు పరిగణించలేము’ అని జస్టిస్ ఎస్కే పాణిగ్రహి తెలిపారు.

19 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన కేసులో హైకోర్టు ఈ తీర్పును తెలిపింది. అంతేకాదు ఈ కేసులో నిందితుడైన అచ్యుత్ కుమార్ అనే వ్యక్తికి బెయిల్‌ను కూడా మంజూర్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అచ్యుత్ కుమార్ తనతో శారీరంగా సంబంధం పెట్టుకున్నాడని ఓ బాలిక గతేడాది నవంబర్‌లో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు గర్భం రాకుండా బలవంతంగా మాత్రలు మింగించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బెయిల్ కావాలంటూ అచ్యుత్ కింది కోర్టును ఆశ్రయించాడు. అయితే  కింది కోర్టు అతడి బెయిల్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించడంతో పాటు, నిందితుడికి మద్దతుగా తీర్పును ఇవ్వడంతో సరికొత్త చర్చకు దారితీసింది.

Read This Story Also: Breaking: భారత హాకీ లెజండ్, ఒలింపిక్‌ విన్నర్ బల్పీర్ సింగ్ కన్నమూత..!