కాశ్మీర్ ప్రశాంతం ? 72 పారా మిలిటరీ బలగాల ఉపసంహరణ

|

Dec 25, 2019 | 1:37 PM

జమ్మూకాశ్మీర్ లో 72 కంపెనీలను (7 వేల మందికి పైగా జవాన్లను) తక్షణమే ఉపసంహరించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన నాలుగు నెలల అనంతరం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆ రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతలను సమీక్షించిన తరువాత ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం శ్రీనగర్ డీజీపీ ఈ విషయాన్ని తెలిపారు. ఈ జవాన్లంతా వెంటనే తమ తమ […]

కాశ్మీర్ ప్రశాంతం ?  72 పారా మిలిటరీ బలగాల ఉపసంహరణ
Follow us on

జమ్మూకాశ్మీర్ లో 72 కంపెనీలను (7 వేల మందికి పైగా జవాన్లను) తక్షణమే ఉపసంహరించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన నాలుగు నెలల అనంతరం హోం శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆ రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతలను సమీక్షించిన తరువాత ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం శ్రీనగర్ డీజీపీ ఈ విషయాన్ని తెలిపారు. ఈ జవాన్లంతా వెంటనే తమ తమ లొకేషన్స్ కి తిరిగి వెళ్లాలని ఆదేశించినట్టు ఆయన చెప్పారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్ బీ లకు చెందిన యూనిట్ల జవాన్లను ఉపసంహరిస్తున్నట్టు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ నుంచి 24 కంపెనీలు, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్ బీ ల నుంచి 12 కంపెనీల చొప్పున జవాన్లు ఇక వెనక్కి తమ లొకేషన్స్ కి తిరుగుముఖం పట్టనున్నారు. గత ఆగస్టు 5 న 370 ఆర్టికల్ రద్దు తరువాత.. జమ్మూ కాశ్మీర్ కు ఈ బలగాలను పంపారు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీ.సీ. ముమ్ము, హోం శాఖ కార్యదర్శి అజయ్ కె. భల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో కొద్దిసేపు హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ బలగాల తక్షణ ఉపసంహరణకు కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితి నెలకొనడమే కారణమని భావిస్తున్నారు.