Serum Institute covishield Vaccine: దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, ఆ తర్వాత క్రమ క్రమంగా దేశ ప్రజలకు టీకా అందుబాటులోకి రానుంది. తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కోవిడ్ వ్యాక్సిన్ తక్కువ ధరకు అందజేస్తున్నామని సీరం సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు.
మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే రూ.200లకే అందిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ప్రైవేట్ మార్కెట్లో రూ.1000 విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. దేశంలో సామాన్యులు, పేదలు, ఆరోగ్య కార్యకర్తల కోసం తక్కువ ధరకు సమకూరుస్తున్నట్లు చెప్పారు.
కాగా, కోవిషీల్డ్ టీకా కోసం అనేక దేశాలు పీఎంవోను సంప్రదిస్తున్నాయన్నారు. అందరిని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే వ్యాక్సిన్‌ను అందజేస్తామని సీరం సీఈవో వివరించారు.
కాగా, వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి మాట్లాడుతూ.. తాము ప్రతి నెలా 70-80 మిలియన్ మోతాదులను తయారు చేస్తున్నామని, అలాగే విదేశీ దేశాలు తమ టీకాను అందించనున్నామన్నారు. పూణే విమానాశ్రయానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ తొలిసారిగా తీసుకెళ్తున్న మూడు ట్రక్కులు ఈ రోజు దేశ వ్యాప్తంగా 13 ప్రాంతాలకు తరలి వెళ్లాయి. ఢిల్లీ, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, కోల్‌కతా, భూవనేశ్వరి, గౌహతి తదితర ప్రాంతాలున్నాయి. జనవరి 16న దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Also Read:
Covid Vaccine: ఏపీకి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.. తొలి విడతగా 4.96 లక్షల కరోనా టీకాల పంపిణీ..