100 Crore Vaccination: త్వరలో విదేశాలకు కోవ్యాక్సిన్.. పలు కీలక వివరాలను వెల్లడించిన సీరం సీఈఓ అదర్ పునావాలా

|

Oct 22, 2021 | 2:17 PM

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ ను దాటిన సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఆయన ఇంటర్వూ ఇచ్చారు సీరం ఇనిస్టిట్యూట్ సిఈఓ అదార్ పునావాలా. వచ్చే వారం లేదా ఆ తర్వాతి..

100 Crore Vaccination: త్వరలో విదేశాలకు కోవ్యాక్సిన్.. పలు కీలక వివరాలను వెల్లడించిన సీరం సీఈఓ అదర్ పునావాలా
Serum Institute Chief Adar
Follow us on

వ్యాక్సినేషన్‌లో వంద కోట్ల మైలురాయిని చేరుకోవడంపై దేశం మొత్తం గర్వంగా ఫీలవుతోంది. వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశంలో వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 100 కోట్ల మార్క్‌ దాటడంపై ప్రధాని మోడీ దేశ ప్రజలను కొనియాడారు. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా బూస్టర్‌ డోస్‌పై కీలక ప్రకటన చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మార్క్ ను దాటిన సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఆయన ఇంటర్వూ ఇచ్చారు సీరం ఇనిస్టిట్యూట్ సిఈఓ అదార్ పునావాలా. వచ్చే వారం లేదా ఆ తర్వాతి వారాల్లో కోవ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. 20, 30 మిలియన్ల డోసులను ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.

వచ్చే క్రిస్టమస్ నాటికి దేశంలో సరిపోయే డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇదే సమయానికి మిగితా వ్యాక్సిన్ కంపెనీల వ్యాక్సిన్‌ల తయారీల సామర్థ్యం పెరుగుతుందన్నారు. బూస్టర్ అవసరమన్నదే శాస్త్రవేత్తల సూచన అని తెలిపారు. అందుకు తాము సిద్దంగా ఉన్నామని.. ప్రభుత్వం నిర్ణయం తర్వాత వాటిని అందిస్తామన్నారు.

ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో బూస్ట్ డోస్‌లు ఇస్తున్నారని.. భారత్‌లో మొదట రెండు డోసులు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వివరించారు. ఒక్క డోస్ తీసుకున్నావారు దాదాపు 65 శాతం ప్రొటెక్షన్ కెపాసిటీ పొందారని అన్నారు. కోవ్యాక్సిన్ కు అనుమతి పొందిన తర్వాత నాపై బడా వేత్తలు, ఇతర గ్రాండ్స్ నుంచి ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమే అని మరో సారి గుర్తు చేశారు. 100 కోట్ల మార్క్ ను దాటడంలో కేంద్రం, ప్రజల భాగస్వామ్యం ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి: Ice Cream: పైకి మాత్రం ఐస్‌క్రీమ్‌ తింటున్నట్లే ఉంటుంది.. అందులో ఏం కలిపారో తెలిస్తే షాకే..