‘సమ్థింగ్బిగ్ సూన్ ఇండియా’ అంటూ భారత స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్స్‌లో గుబులు రేపిన హిండెన్‌బర్గ్.. సంచలన ప్రకటన చేసింది. గతేడాది అదానీ గ్రూప్‌పై సంచలన నివేదిక విడుదల చేసి.. ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమవడానికి కారణమైన హిండెన్‌బర్గ్.. ఇప్పుడు ఏకంగా సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌తో పాటుఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ స్టాక్స్‌ని ఆర్టిఫీషియల్‌గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్అఫ్షోర్ ఫండ్స్‌లో మాధబి, ధవల్బచ్కు వాటాలు ఉన్నాయంటూ తాజాగా నివేదిక ఇచ్చింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సెబీ చీఫ్ మాధబి పురి, ఆమె భర్త ధవల్ కూడా పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది.
సెబీ చైర్‌పర్సన్‌గా మాధబి బాధ్యతలు చేపట్టడానికి కొన్నిరోజుల ముందు, అంటే 2017 మార్చి 22న ఆమె భర్త ధవల్ మారిషస్‌ను సంప్రదించినట్లు హిండెన్‌బర్గ్ తాజాగా ఆరోపించింది. గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ట్రైడెంట్ ట్రస్ట్ అనే మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్‌ను ధవల్ సంప్రదించినట్లు- హిండెన్‌బర్గ్ ఆరోపించింది. తన భార్య పేరుమీద ఉన్న ఆస్తులను బదలాయించి, వాటికి తానే ఆథరైజ్డ్ పర్సన్‌గా ఉంటానంటూ ధవల్ చెప్పారన్న అంశాన్ని హిండెన్‌బర్గ్ తెరమీదకు తెచ్చింది. మారిషస్ సంస్థలో ధవల్ పెట్టుబడుల నికర విలువ 10 మిలియన్ డాలర్లు, అంటే 83 కోట్ల రూపాయలని హిండెన్‌బర్గ్ చెబుతోంది. అదానీ గ్రూప్‌పై సరిగా విచారణ చేయకపోవడానికి కూడా ఇదే కారణమంటూ హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలే ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
ఆరోపణల్లో వాస్తవం లేదంటున్న సెబీ చీఫ్ దంపతులు
అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి, ఆమె భర్త ధవల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవన్నీ నిరాధారమని ప్రకటన విడుదల చేశారు. తమ జీవితం తెరిచిన పుస్తకమనీ.. ఆర్థిక వ్యవహారాల వివరాలను ఎప్పటికప్పుడు సెబీకి ఇస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఏ సంస్థ కోరినా ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ……స్పాట్…… 1PM Sebi Wife Husband Scrolling
తమది పారదర్శక విధానం అంటున్న అదానీ గ్రూప్
హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలతో తమకు సంబంధం లేదని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తెలిపింది. సెబీ చీఫ్‌తోనూ, ఆమె భర్తతోనూ తమకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధం లేదని గౌతమ్ అదానీ గ్రూప్ తెలిపారు. నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం తాము పారదర్శక విధానాలను అవలంబిస్తున్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్
ఇక రాజకీయపక్షాలు సైతం ఈ వివాదంలోకి ఎంటరయ్యాయి. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సెబీ వంటి సంస్థల విశ్వసనీయతను కాపాడాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కోరారు.
మోదీ రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్
ఇక ఆమ్ ఆద్మీ అయితే.. ఏకంగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. హిండెన్‌బర్గ్ రెండు నివేదికలతో.. సెబీకి, అదానీకి మధ్య లింకులు ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. ఈ దర్యాప్తు ఎక్కడికి వెళుతుందో చెప్పలేమని సెబీ అనడాన్ని ఆమ్‌ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్ తప్పుబట్టారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ గట్టిగానే తిప్పికొడుతోంది. దేశంలో ఆర్థిక ఆత్మనిర్భరత కోసం తాము పనిచేస్తుంటే, ఆర్థిక అరాచకం ప్రబలడానికి కాంగ్రెస్, ఇతర విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ మండిపడింది. దేశ ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తున్న ఈ పార్టీలకు, విదేశీ సంస్థలతో ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.