దారుణం.. స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫైటింగ్‌.. ఒకరు మృతి

|

Dec 05, 2024 | 8:07 PM

ఈ సంఘటనలో 12 ఏళ్ల ప్రిన్స్ అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తరలించగా ఆ బాలుడికి మూర్ఛ సంబంధిత సమస్య ఉండి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.

దారుణం.. స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫైటింగ్‌.. ఒకరు మృతి
School Boy Dies In Fight
Follow us on

ఒక స్కూల్‌లో విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణం పోయేలా చేసింది. విద్యార్థుల మధ్య తలెత్తిన ఈ ఘర్షణలో ఒక విద్యార్థి మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్‌ 3 మంగళవారం ఉదయం ఢిల్లీలోని చిన్మయ విద్యాలయంలో మార్నింగ్‌ ప్రేయర్‌ సమయంలో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఇరువురు స్వల్పంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనలో 12 ఏళ్ల ప్రిన్స్ అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తరలించగా ఆ బాలుడికి మూర్ఛ సంబంధిత సమస్య ఉండి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.

విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్‌లోని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..