SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ రుణాలపై బంపర్ ఆఫర్స్… వారికి మాత్రమే ఛాన్స్..

|

Dec 05, 2020 | 3:29 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‏బీఐ రుణాలపై అదిరిపోయే ఆఫర్లను తీసుకు వచ్చింది. పర్సనల్ లోన్ దగ్గరి నుంచి హోం లోన్ వరకు

SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ రుణాలపై బంపర్ ఆఫర్స్... వారికి మాత్రమే ఛాన్స్..
Follow us on

SBI LOAN OFFERS: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‏బీఐ రుణాలపై అదిరిపోయే ఆఫర్లను తీసుకు వచ్చింది. పర్సనల్ లోన్ దగ్గరి నుంచి హోం లోన్ వరకు పలు ఆఫర్స్ అందిస్తుంది. లోన్ తీసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తించనున్నాయి.

ఎస్‏బీఐ తన కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. పర్సనల్ లోన్స్‏పై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభంకానుంది. అంతేకాకుండా గోల్డ్ లోన్ పైన వడ్డీ రేటు 7.5 శాతం ఉండనుంది. దీంతోపాటు కారు కొనాలనుకునేవారికి కూడా చౌక వడ్డీకే లోన్ ఇవ్వనుంది. ఎస్‏బీఐ కార్ లోన్ పై వడ్డీరేటు 7.5 శాతం నుంచి ప్రారంభం కానుంది.

ఇవే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రుణ గ్రహీతలకు కూడా కొన్ని రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హోంలోన్ పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభం కాగా… ఈ రుణాలన్నింటిపైనా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ లభిస్తుంది. ఎస్‏బీఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకుంటే కూడా ఈ ఆఫర్లు లభించనున్నాయి.

ఎస్‏బీఐలో హోం లోన్ కూడా యోనో యాప్ ద్వారానే అప్లై చేసుకుంటే 0.05 శాతం వడ్డీ తగ్గింపు ఉంటుంది. ఇక‏నుంచి కస్టమర్లు ఆన్‏లైన్లో కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. ఎస్‏బీఐలో లోన్ తీసుకుంటే రుణం కూడా పొందవచ్చు.

ఇంకా చదవండి: