Sarabjit Singh Killer Short Dead: పాక్‌ అండర్‌ వరల్డ్ డాన్‌ ‘అమీర్‌ సర్పరాజ్‌’ హతం.. సరబ్‌జిత్ సింగ్‌ ఆత్మకు శాంతి!

|

Apr 14, 2024 | 6:59 PM

పాక్‌ అండర్‌ వరల్డ్ డాన్‌ అమీర్‌ సర్పరాజ్‌హత్యకు గురయ్యాడు. భారత పౌరుడు సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో చంపిన అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తంబాపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. పాకిస్థాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్‌లలో ఒకరైన అమీర్ సర్ఫరాజ్ లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అమీర్‌ సర్పరాజ్‌ను ఆస్పత్రికి..

Sarabjit Singh Killer Short Dead: పాక్‌ అండర్‌ వరల్డ్ డాన్‌ అమీర్‌ సర్పరాజ్‌ హతం.. సరబ్‌జిత్ సింగ్‌ ఆత్మకు శాంతి!
Amir Sarfaraz Short Dead In Lahore
Follow us on

లాహోర్‌, ఏప్రిల్‌ 14: పాక్‌ అండర్‌ వరల్డ్ డాన్‌ అమీర్‌ సర్పరాజ్‌హత్యకు గురయ్యాడు. భారత పౌరుడు సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో చంపిన అమీర్ సర్ఫరాజ్ అలియాస్ తంబాపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. పాకిస్థాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్‌లలో ఒకరైన అమీర్ సర్ఫరాజ్ లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అమీర్‌ సర్పరాజ్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా అమీర్ సర్ఫరాజ్ 1979లో లాహోర్‌లో జన్మించాడు. లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడికి అత్యంత సన్నిహితుడు. లాహోర్‌ జైల్లో సరబ్‌జిత్ సింగ్‌పై దాడి చేసినందుకు అమీర్ సర్ఫరాజ్, అతడి అనుచరులపై కేసు నమోదైంది. అయితే సర్ఫరాజ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం లేకపోవడంతో 2018లో పాకిస్థాన్ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఎవరీ సరబ్జిత్ సింగ్ ?

1990లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది పాకిస్తానీ పౌరులను చంపినందుకు పంజాబ్ వాసి సరబ్‌జిత్ సింగ్‌కు మరణశిక్ష విధించబడింది. అయితే ఈ ఆరోపణలను అతని కుటుంబంతోపాటు భారత అధికారులు తీవ్రంగా ఖండించారు. సరబ్‌జిత్‌ సింగ్‌ వ్యవసాయం చేస్తూ పొరపాటున పాకిస్థాన్‌ సరిహద్దు దాటాడని ఆయన కుటుంబం చెబుతోంది. అయినా కనికరించనీ పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనను 23 యేళ్ల పాటు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉంచింది. ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో మే 2013లో అమీర్‌ సర్పరాజ్‌ హత్య చేశాడు. అమీర్ సర్ఫరాజ్‌తో సహా కొంతమంది ఖైదీలు అతనిపై దాడి చేసి హత్య చేశారు. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా నిర్ధారణ అయిన అఫ్జల్ గురును భారత్‌ ఉరితీసిన కొన్ని రోజుల్లోనే సరబ్‌జిత్ సింగ్‌పై దాడి జరిగింది. ఖైదీల గుంపు తలపై ఇటుకలతో కొట్టడంతో మెదడుకు తీవ్ర గాయాలై లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పాక్‌ సర్కార్‌ భారత్‌కి పంపించింది.

ఇవి కూడా చదవండి

సరబ్‌జిత్ సింగ్‌ జైలు శిక్ష అనుభవించినన్నాళ్లు అతని అక్క దల్బీర్ సింగ్ తన సోదరుడిని విడుదల చేయాలని అవిశ్రాంతంగా పోరాడింది. సరబ్‌జిత్ సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 2016లో రణదీప్ హుడా, ఐశ్వర్యారాయ్ బచ్చన్ నటించిన ‘సరబ్జిత్’ అనే బాలీవుడ్‌ మువీ కూడా విడుదలైంది. సరబ్‌జిత్ సింగ్‌ అక్క దల్బీర్ కౌర్ తన సోదరుడిని విడుదల చేయాలంటూ ఆమె పడిన కష్టాల ఆధారంగా ఈ మువీని రూపొందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.