రాజ్‌భవన్‌లోనే రక్షణ కరువు.. ఆవరణలోని గంధపు చెట్లను నరుకెళ్లిన దొంగలు.. ఖాకీలకు ఝలక్‌!

గవర్నర్ అధికారిక నివాసంలోనే చోరీ జరగడం పోలీసులను కంగుతినిపించింది. రాజ్ భవన్ భద్రతకు కనీసం 60 మంది పోలీసు అధికారులు బాధ్యత వహిస్తారు. కొందరు కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజ్‌భవన్‌లోనే రక్షణ కరువు.. ఆవరణలోని గంధపు చెట్లను నరుకెళ్లిన దొంగలు.. ఖాకీలకు ఝలక్‌!
Raj Bhawan

Updated on: Nov 04, 2022 | 11:04 AM

శ్రీగంధానికి దేశ విదేశాల్లో విపరీతమైన విలువ ఉంది. ఎక్కడైనా ఒక్క గంధం చెట్టు కనబడితే చాలు..అది పూర్తిగా ఎదిగి చేతికి రాకముందే…నరికి స్మగ్లింగ్ చేస్తుంటారు దుండగులు. ఇప్పుడు అలాంటిదే షాకింగ్ విషయం ఏమిటంటే రాజ్ భవన్ ఆవరణలో ఉన్న గంధపు చెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఒడిశాలోని రాజ్‌భవన్‌ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఒడిశా గవర్నర్ బస చేసే రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగింది. అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే… సామాన్యులు చందనం పెంచితే ఏమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. గవర్నర్‌, రాజ్‌భవన్‌ సిబ్బంది భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

గవర్నర్ అధికారిక నివాసంలోనే చోరీ జరగడం పోలీసులను కంగుతినిపించింది. రాజ్ భవన్ భద్రతకు కనీసం 60 మంది పోలీసు అధికారులు బాధ్యత వహిస్తారు. కొందరు కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భువనేశ్వర్‌లోని అత్యంత భద్రతతో కూడిన రాజ్‌భవన్‌ ఆవరణలో చందనం చెట్లను నరికి దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. చెట్టును నరికివేయడంతో రాజ్‌భవన్‌ తరపున పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు దొంగల ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రాజ్‌భవన్‌ ఆవరణలో మూడు గంధపు చెట్లను దొంగిలించిన ఘటనపై రాజధాని పోలీస్‌ స్టేషన్‌ విచారణ ప్రారంభించింది.

సామాన్యులు కూడా చందనాన్ని పెంచుకోవచ్చు. కానీ గంధపు నూనె, పెర్ఫ్యూమ్, గంధపు సబ్బుల తయారీకి సాధారణంగా ఉపయోగించే వీటిని కోత, రవాణా సమయంలో అటవీ శాఖ నుండి అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం భారత్‌లో చందనం ఎగుమతిపై నిషేధం విధించింది. దేశంలోని గంధపు చెక్క జాతులను రక్షించడానికి ఈ పరిరక్షణ చర్యలు చేపట్టబడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి