Sambhal Mandir-Masjid Row: శివాలెత్తుతున్న సంభల్.. తెరపైకి మందిర్‌-మసీదు వివాదం..

సంభల్ పురాతన ఆలయం బయటపడడంతో.. మరోసారి దేశవ్యాప్తంగా మందిర్‌-మసీదు అంశం తెరపైకి వస్తోంది. ఇటీవలి కాలంలో ప్రార్థనా స్థలాల వివాదాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సంభల్‌లోని జామా మసీదు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని ఓవర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Sambhal Mandir-Masjid Row: శివాలెత్తుతున్న సంభల్.. తెరపైకి మందిర్‌-మసీదు వివాదం..
Sambhal Mandir-Masjid Controversy

Updated on: Dec 17, 2024 | 9:31 PM

మట్టిలో విగ్రహాలు.. తవ్వితే శివలింగాలు.. సంభల్‌ భూమిలో బయటపడుతున్న పురాణ ఆలయాలు.. మరోసారి సంభల్ వేదికగా మందిర్‌-మసీదు వివాదం తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ పురాతన ఆలయం బయటపడింది.. ఇప్పుడిదే దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు వేదికైంది. ఆలయంలో హనుమాన్ విగ్రహం ఉంది..ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది.. ఎదురుగా నందివిగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజునుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి.. పూజలు, హోమాలు నిర్వహించారు. 46ఏళ్ల తరువాత వెలుగులోకి వచ్చిన శివాలయానికి భక్తులు బారులు దీరారు. శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అక్రమ నిర్మాణాల మధ్య చిక్కుకుపోయి…శిధిలావస్తకు చేరిందీ ఆలయం. శివాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో బయటపడ్డ పురాతన బావి ఏ కాలం నాటిదో తెలుసుకోవాలని పురావస్తు శాఖకు జిల్లా కలెక్టర్‌ రాజేందర్‌ పన్సియా లేఖ రాశారు. పురాతన బావిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. శివాలయంలో ఎస్పీతో కలిసి కలెక్టర్‌ పూజలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్టు తమ తనిఖీల్లో తేలిందని.. ఆలయ ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని స్థానిక కలెక్టర్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయం లోపల, బయట అధికారులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోని బావిలో మూడు ధ్వంసమైన విగ్రహాలు కూడా బయటపడ్డాయి. బావిలోకి ధ్వంసమైన విగ్రహాలు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి