ములాయం సింగ్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గతకొద్ది రోజులుగా ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అన్ని రకాల టెస్టులు చేశామని ఆస్పత్రి డైరక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. కాగా.. ములాయం సోదరుడు శివపాల్ సింగ్, కోడలు డింపుల్ యాదవ్‌లు ఆస్పత్రిలో ములాయంను పరామర్శించారు. ఇదిలావుంటే ప్రస్తుతం ములాయం ఆరోగ్యం మెరుగ్గానే […]

ములాయం సింగ్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

Edited By:

Updated on: May 08, 2020 | 11:18 AM

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గతకొద్ది రోజులుగా ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అన్ని రకాల టెస్టులు చేశామని ఆస్పత్రి డైరక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. కాగా.. ములాయం సోదరుడు శివపాల్ సింగ్, కోడలు డింపుల్ యాదవ్‌లు ఆస్పత్రిలో ములాయంను పరామర్శించారు. ఇదిలావుంటే ప్రస్తుతం ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు.