
దేశీయ బ్రాండ్ల విలువను పెంచడంపై సద్గురు కీలక వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరుగుతున్న బ్రాండ్ ఇన్‌సైట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 100 మందికి పైగా బ్రాండ్ మేనేజర్లు, వ్యాపారవేత్తలు, సి-సూట్ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశం బ్రాండ్ బలంగా ఉంటే, ఇక్కడ ప్రతి వ్యక్తి గౌరవం పెరుగుతుందని చెప్పారు. ‘‘గత కొన్ని ఏళ్లుగా విదేశాల్లో మన పాస్‌పోర్టుకు గౌరవం పెరిగింది. అలాగే, మన దేశపు ఉత్పత్తులు కూడా ప్రపంచస్థాయిలో ఉండాలి. ‘మేడ్ ఇన్ భారత్’ అంటే అది అత్యుత్తమమైనది అనే నమ్మకం కల్పించాలి’’ అని ఆయన తెలిపారు.
We must build the Nation’s brand such that Bharat = The Best. Because when the Nation’s brand is built, every citizen’s brand is better – not only businesses. People are looking at an Indian passport a little more respectfully today than they used to ten years ago. That’s brand… pic.twitter.com/bgxYxWGev4
— Sadhguru (@SadhguruJV) February 28, 2026
యోగా గురించి మాట్లాడుతూ.. మంచి వస్తువు ఉన్నా దానికి సరైన ప్రచారం లేకపోతే నష్టపోతామని సద్గురు హెచ్చరించారు. ‘‘యోగా వల్ల చాలా మంచి జరుగుతుంది.. కానీ గతంలో దానికి సరిగ్గా బ్రాండింగ్ చేయకపోవడం వల్ల చాలామందికి దాని విలువ తెలియలేదు. ఇప్పుడు మేము ఆ పరిస్థితిని మారుస్తున్నాం,” అని ఆయన చెప్పారు.
సద్గురు అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు జరుగుతున్న ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో బ్రాండింగ్ వ్యూహాలపై చర్చలు జరిగాయి. అనిషా మోత్వానీ, అమీన్ హక్, కృష్ణన్ సుబ్రమణియన్, రాహుల్ జౌహరి, సోనాల్ దబ్రాల్, నారాయణ్ దేవనాథన్ వంటి మార్కెటింగ్ దిగ్గజాలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విజయవంతమైన బ్రాండ్ల సృష్టి, వ్యూహాత్మక స్పష్టత, డైనమిక్ మార్కెట్లలో ప్రభావవంతమైన పనితీరును పెంపొందించడం.
సద్గురు అకాడమీ సమకాలీన వ్యాపార అవసరాలకు అనుగుణంగా లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది.