బ్రేకింగ్: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ‘సుప్రీం’ తీర్పు

| Edited By:

Nov 14, 2019 | 11:39 AM

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది. మత విశ్వాసం అనేది పౌరుల హక్కు అని.. ఈ వివాదంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును విస్తృత ధర్మాసనం బదిలీ చేశారు. పెండింగ్ పిటిషన్లపై ఆ ధర్మాసనమే విచారణ […]

బ్రేకింగ్: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పు
Follow us on

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది. మత విశ్వాసం అనేది పౌరుల హక్కు అని.. ఈ వివాదంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును విస్తృత ధర్మాసనం బదిలీ చేశారు. పెండింగ్ పిటిషన్లపై ఆ ధర్మాసనమే విచారణ చేస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి తీర్పు విషయంలో ముగ్గురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. ఇద్దరు న్యాయమూర్తులు నారిమన్, వైవీ చంద్రచూడ్ విభేదించారు. అయితే ప్రస్తుతానికి అన్ని వయసుల మహిళలు ప్రవేశానికి అర్హులే. అయితే అయోధ్య కేసు విషయంలో సంచలన తీర్పును ఇచ్చిన సుప్రీం.. శబరిమల విషయంలో మాత్రం ఎటూ తేల్చకపోవడం గమనర్హం.