అయ్యో దేవుడా.. శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..

తమిళనాడులోని రామనాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయనగరం జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొనగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

అయ్యో దేవుడా.. శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
Road Accident

Updated on: Dec 06, 2025 | 11:21 AM

తమిళనాడులోని రామనాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయనగరం జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొనగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని విజయనగరం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన రామకృష్ణ, మరడ రాము, అప్పలనాయుడు, రామచంద్రరావుగా గుర్తించారు. విషయం తెలిసి వారి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కీళకరై ఈసీఆర్‌ వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీకొట్టిందని వెల్లడించారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..