Russia-Ukraine War: ఏ విషయంలో ఎలా స్పందించాలో భారత్‌కు తెలుసు.. భారత దౌత్యంపై జర్మన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Russia-Ukraine War:ప్రపంచంలోని దేశాల్లో భారతీయులు(Indians)ఉంటారు. ఉపాధి కోసం, చదువు కోసం లేదా ఉద్యోగమో ఇలా రీజన్ ఏదైనా కానీ.. అగ్రరాజ్యం అమెరికా(America) అయినా చీకటి ఖండం ఆఫ్రికా(Africa) అయినా సరే

Russia-Ukraine War: ఏ విషయంలో ఎలా స్పందించాలో భారత్‌కు తెలుసు.. భారత దౌత్యంపై జర్మన్ రాయబారి కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War

Updated on: Mar 07, 2022 | 4:08 PM

Russia-Ukraine War:ప్రపంచంలోని దేశాల్లో భారతీయులు(Indians)ఉంటారు. ఉపాధి కోసం, చదువు కోసం లేదా ఉద్యోగమో ఇలా రీజన్ ఏదైనా కానీ..  అగ్రరాజ్యం అమెరికా(America) అయినా చీకటి ఖండం ఆఫ్రికా(Africa) అయినా సరే.. భారతీయులకు ఒకటే అనిపిస్తారు. అయితే తాముంటున్న దేశంలో ఏదైనా విపత్తు, లేకా సంక్షోభం ఏర్పడితే.. వెంటనే వారు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని కోరుకుంటారు. ఆలా విదేశాల్లో  ఉన్న భారతీయులను ఎటువంటి సంక్షోభ సమయంలోనైనా తిరిగి స్వదేశాని తీసుకొస్తుంది.. భారత దౌత్యం. రెండేళ్ల క్రితం కరోనా సమయంలో చైనాలోని భారతీయులను తిరిగి స్వదేశాని కి తరలింపు అయినా.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ లోని విద్యార్థులను, భారాతీయులను తిరిగి తీసుకొస్తునాదైన సరే.. దీని వెనుక భారత దౌత్యవేత్తల కృషి ఉందని అందరికీ తెలిసిందే. తాజాగా జర్మన్ రాయబారి  జే లిండ్నర్ భారత దౌత్యవేత్తలు అద్భుతమైన వారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రపంచం విషయంలో భారతదేశం పాత్రను యూరోపియన్ యూనియన్ ఎలా చూస్తుంద విషయంపై భారత్‌లోని జర్మన్‌ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ స్పందించారు. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న ఆందోళనలపై మీడియాతో ఆయన మాట్లాడుతూ..  ఎటువంటి సంక్షోభమైనా దానిని తట్టుకుంటూ ఎలా స్పందించాలి, ఏమి చేయాలో భారత దౌత్య వేత్తలకు బాగా తెలుసన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అన్ని దేశాలకంటే.. భారతీయుల సురక్షితంగా తరలింపు విషయంలో ఒక అడుగు ముందు ఉంది. ఇలా అక్కడ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత దౌత్యవేత్తలు చేస్తున్న కృషి ఎంతో గొప్పదంటూ జే లిండ్నర్ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు తగిన స్థానంతోపాటు అద్భుతమైన దౌత్య సేవలు ఉన్నాయని చెప్పారు.

ఉక్రెయిన్ దేశంలో చిక్కున్న వారిని రక్షించడం ఎలాగో..భారత్ ఇతర దేశాలకు చెప్పకనే చెబుతోంది అంటూ .. భారత దౌత్యవేత్తలను చూసి ఏం చేయాలో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

Also Read:

వామ్మో.. రియల్ హర్రర్… అలనాటి విఠలాచార్య సినిమాలను గుర్తు చేస్తూ..తలను తిప్పేస్తున్న అమ్మాయి..