వీటితోనే భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు పెనుప్రమాదం పొంచి ఉంది.. ఆర్ఎస్ఎస్ చీఫ్ దసరా పండుగ స్పీచ్

|

Oct 15, 2021 | 3:44 PM

ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసెస్, డ్రగ్స్, బిట్‌కాయిన్ లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన దసరా ప్రసంగం సాగింది. విజయదశమి పర్వదిన పండుగను పురస్కరించుకుని నాగపూర్ లోని

వీటితోనే భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు పెనుప్రమాదం పొంచి ఉంది.. ఆర్ఎస్ఎస్ చీఫ్ దసరా పండుగ స్పీచ్
Rss Chief
Follow us on

Mohan Bhagwat: ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసెస్, డ్రగ్స్, బిట్‌కాయిన్ లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన దసరా ప్రసంగం సాగింది. విజయదశమి పర్వదిన పండుగను పురస్కరించుకుని నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం ఇచ్చిన ప్రసంగంలో మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాగ్‌పూర్‌ లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా వేడుకల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌. దేశాన్ని డ్రగ్స్‌ మహమ్మారి పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారారని , ఓటీటీలతో తీరని నష్టం జరుగుతోందని అన్నారు మోహన్‌ భగవత్‌.

ఓటీటీలపై నియంత్రణ అవసరం అన్నారు ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ . డ్రగ్స్‌ రవాణాను అరికట్టాలని పిలుపునిచ్చారు. పేద , ధనిక వర్గాల తేడా లేకుండా అన్ని వర్గాలు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిట్‌కాయిన్‌తో దేశ ఆర్ధిక వ్యవస్థకు పెనుప్రమాదం పొంచి ఉందన్నారు మోహన్‌ భగవత్‌. డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టడంలో అధికార యంత్రాగం విఫలమవుతోందని విమర్శించారు.

దసరా సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్ లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు మోహన్‌ భగవత్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల కవాతుల ఆకట్టుకుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ , కర్రసామును ప్రదర్శించారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు.

RSS

Read also: AP Weather Report: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల రెండు రోజులకు వర్ష సూచనలు