Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా.. వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నా వదలని మహమ్మారి

|

Apr 10, 2021 | 10:25 AM

COVID-19 Positive: దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు భారీగా పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ అందరూ కరోనా బారిన పడుతున్నారు. సాధారణ

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా.. వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నా వదలని మహమ్మారి
Rss Chief Mohan Bhagwat
Follow us on

COVID-19 Positive: దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు భారీగా పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ అందరూ కరోనా బారిన పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా సోకింది. ఇటీవలనే ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ క్రమంలో భగవత్‌కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఆర్ఎస్ఎస్ శుక్రవారం పేర్కొంది. వెంటనే ఆయన నాగ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని ఆర్ఎస్ఎస్ ట్విట్ చేసి వెల్లడించింది.

‘‘మోహన్ భగవత్ జీకు ఈ రోజు మధ్యాహ్నం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయనకు కరోనావైరస్ సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఈ మేరకు భగవత్ జీ నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు’’. అంటూ ఆర్ఎస్ఎస్ ట్విట్ చేసి వెల్లడించింది. ఇదిలాఉంటే.. మార్చి 7 న మోహన్ భగవత్ కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. భగవత్‌తో పాటు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి కూడా నాగ్‌పూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కరోనా టీకా వేసుకున్నారు. అయినప్పటికీ.. ఆయన కరోనా బారిన పడ్డారు.

ఆర్ఎస్ఎస్ ట్విట్..

Also Read:

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

బెదిరింపులు.. సెటిల్మెంట్లు.. ఒక్కటేమిటీ.. అమ్మో..! సచిన్‌ వాజే మాములోడు కాదుగా..!