Flag on Mosque: ఆగ్రాలో మసీదుపై ఎగిరిన జాతీయ జెండా..బీజేపీ నేతకు బెదిరింపులు..

| Edited By: Anil kumar poka

Aug 16, 2021 | 8:57 PM

యూపీ మైనారిటీల కమిషన్ చైర్మన్, బీజేపీ నేత కూడా అయిన ఆష్వాక్ సైఫీ చిక్కుల్లో పడ్డారు. ఆగ్రాలోని జామా మసీదుపై ఆయన నిన్న జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అయితే ఇలా చేయరాదంటూ స్థానిక కాంగ్రెస్ నేత హాజీ జమీలుద్దీన్, మరో మత గురువు తప్పు పడుతూ..

Flag on Mosque: ఆగ్రాలో మసీదుపై ఎగిరిన జాతీయ జెండా..బీజేపీ నేతకు బెదిరింపులు..
Row After Bjp Leader Hoists National Flag At Mosque In Agra
Follow us on

యూపీ మైనారిటీల కమిషన్ చైర్మన్, బీజేపీ నేత కూడా అయిన ఆష్వాక్ సైఫీ చిక్కుల్లో పడ్డారు. ఆగ్రాలోని జామా మసీదుపై ఆయన నిన్న జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అయితే ఇలా చేయరాదంటూ స్థానిక కాంగ్రెస్ నేత హాజీ జమీలుద్దీన్, మరో మత గురువు తప్పు పడుతూ.. ఆయనను తీవ్రంగా హెచ్చరించారు. అది భగవంతుని ఆగ్రహానికి కారణమవుతుందన్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాలను రాజకీయం చేయ జూస్తే మొత్తం యూపీ లోని ముస్లిములంతా మీ వైఖరిని ఖండిస్తారని వారు అన్నారు. ఇది మీకు మంచిది కాదన్నారు. అయితే ఇది మరో వివాదానికి కూడా దారి తీసింది. మన సొంత గడ్డపై జాతీయ పతాకాన్ని ఎగురవేయకపోతే ఇలాంటి రాడికల్స్, మతగురువులు జకీర్ నాయక్ మాదిరి దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ వ్యాఖ్యానించారు. ఒకరి దేశ భక్తినిశంకించరాదన్నారు. అయితే తనకు అందిన బెదిరింపులపై ఆష్వాక్ సైఫీ స్పందించలేదు.

ఏమైనా భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ విధమైన స్వల్ప సంఘటనలు జరుగుతుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యోపీ లోనే ఔరయా జిల్లా మేజిస్ట్రేట్ సునీల్ కుమార్ నిన్న జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. అది వీడియోకెక్కి సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఇది ట్రయల్ అని ఆయన ఆ తరువాత సర్ది చెప్పినా ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి : బ్యాంక్‌ కస్ట్‌మర్లకు అలర్ట్‌.. ఈ నాలుగు రోజులూ బ్యాంకులకు వెళ్ళకండి..!:Banks Close Video.

 రానున్న రోజుల్లో ముక్కు ద్వారా కరోనా వాక్సిన్.. ట్రయల్స్ కు అనుమతిచ్చిన కేంద్రం:Bharat Biotech Covid vaccine Video.

 షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

 తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం లైవ్ అప్‌డేట్స్ వీడియో..: Afghanistan Crisis Live Video.