సుశాంత్ కేసులో నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనను ఇంటరాగేట్ చేస్తుండగా రియా చక్రవర్తి ఒక్కసారిగా విలపించింది. ఈమెను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రియా సోదరుడు షోవిక్ ను ఇదివరకే అరెస్టు చేశారు. తాను డ్రగ్స్ తీసుకునేదానినని, తరచూ సుశాంత్ కి కూడా ఇచ్చేదానినని ఆమె వెల్లడించింది. 2016 నుంచే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు ఉండేదని ఆమె చెప్పింది. మార్జువానా, నల్లమందు వంటివాటితో కూర్చిన సిగరెట్లను తాము తాగేవారమని రియా పేర్కొంది. అటు-ఆమెకు కరోనా వైరస్ టెస్ట్ తో బాటు ఇతర వైద్య పరీక్షలు జరపనున్నారు.