
Sukanya Samridhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు భారీ విరాళం ప్రకటించారు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన రూ.25 లక్షలను సుకన్య సమృద్ధి ఖాతాలో వంద మంది బాలికలకు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ భూపాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తన సర్వీసు ముగిసిన తర్వాత రిటైర్ అయ్యారు. దీంతో ఆయనకు రూ.25 లక్షలు పెన్షన్ రూపంలో వచ్చాయి. అయితే ఇలా వచ్చిన డబ్బును సొంత ఖర్చుల కోసం వాడుకోకుండా సుకన్య సమృద్ధి యోజన పథకానికి విరాళంగా ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ రేడియో ప్రసంగం కార్యక్రమం ద్వారా శ్రీరామ్ భూపాల్ రెడ్డిని అభినందించారు.
సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించిన పథకం. పూర్తి ప్రభుత్వ రక్షణతో కూడిన పథకం. తల్లిదండ్రులు తమ కుమార్తె పేరు మీద ఈ పొదుపు పథకాన్ని ప్రారంభించి, అందుతో డిపాజిట్ చేస్తుంటే మంచి లాభాన్ని పొందవచ్చు. ఈ మొత్తాన్ని కూతురి చదువుకు లేదా పెళ్లికి వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకం (SSY) వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ. 250తో కుమార్తె పేరు మీద ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 సంవత్సరాల వయస్సు వరకు కుమార్తె పేరు మీద ఈ ఖాతా (Account)ను తెరవవచ్చు. ఖాతాలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి