Restaurants Restrictions: ఇటీవల ఢిల్లీలో ఒక వింత సంఘటన జరిగింది. చీర కట్టుకొని వచ్చినందుకు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెను లోపలికి రానివ్వలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఈ రెస్టారెంట్‌పై చర్య తీసుకుంది. రెస్టారెంట్‌ని సీల్ చేసింది. కానీ చీర కట్టుకున్న మహిళకు ఎంట్రీ ఇవ్వకపోవడం వల్ల కాదు ఆ రెస్టారెంట్‌కి లైసెన్స్ లేని కారణంగా నిషేధం విధించింది. అయితే రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లాలంటే దుస్తులకు సంబంధించి ఏమైనా నియమాలు ఉన్నాయా లేదా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
“చట్టం ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ప్రజా సేవలో చేర్చారు. కాబట్టి వీటిలోకి మిమ్మల్ని ప్రవేశించకుండా ఎవరూ ఆపరాదు. ఎవరైనా ఇలా చేస్తే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నివేదికల ప్రకారం ఢిల్లీ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్.. సదరు రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్‌లో అపరిశుభ్రత కూడా కనిపించింది. దీంతో 48 గంటల్లో రెస్టారెంట్ మూసివేయాలని యజమానిని ఆదేశించారు. ఒకవేళ అలా చేయకపోతే, నోటీసు లేకుండా కార్పొరేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
చట్టం ఏమి చెబుతుంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (2) ప్రకారం.. జెండర్, కులం, మతం, భాష, ప్రాంతం, దుస్తుల ఆధారంగా హోటల్, రెస్టారెంట్, సినిమా హాల్, ధాబాలో ఎవరినీ నిర్బంధించకూడదు. ఒకవేళ అలా చేస్తే సదరు హోటల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ‘ఇది మాత్రమే కాదు ది సరైస్ యాక్ట్, 1867 ‘ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఇటువంటి ప్రదేశాలలో ఉచిత టాయిలెట్, ఉచిత నీరు వంటి సౌకర్యాలను పొందవచ్చు. అంటే నీరు, వాష్‌రూమ్ ఉపయోగించడాన్ని ఏ ఖరీదైన హోటల్ తప్పుబట్టకూడదు. అలాచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి.