Delhi rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఏయిర్ పోర్టులోకి వరద నీరు చేరింది. ప్రవేశ ద్వారం వద్ద నుంచి లోపల వరకు వరద నీరు చేరింది. ఈ వరద నీటిలో బిజెపి ఢిల్లీ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ రోయింగ్ చేస్తూ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా తజిందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ” ఈ సంవత్సరం నేను రోయింగ్ కోసం రిషికేశి వెళ్లాలనుకున్నాను కానీ కరోనా మహమ్మారి వల్ల వెళ్లలేకపోయాను. ఢిల్లీలోనే ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ఎద్దేవా చేశాడు. ఢిల్లీలోని భజనపుర ప్రాంతంలో భారీగా నీటితో నిండిన వీధుల్లో రోయింగ్ చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టాడు.
ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయని ఆయన తెలిపారు.
శనివారం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీ18 సంవత్సరాల రికార్డును అధిగమించింది. ఐఎండీ నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద పోటెత్తింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఢిల్లీలో గత 19ఏళ్లల్లో సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు వివరించారు.
केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దాదాపుగా మోకాలి లోతు వరకు వర్షపు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్ట్‌లో ఈ వర్షపు నీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
बूँद-बूँद से बनता है सागर ??♀️#DelhiAirport claims it’s all clear now and the water has been drained out.
Latest pics below pic.twitter.com/5U1tKeFtUR
— Poulomi Saha (@PoulomiMSaha) September 11, 2021