RBI Monetary Policy: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఎప్పటిలాగానే వడ్డీ రేట్లు..

Budget 2021 - RBI Monetary Policy: న్యూఢిల్లీ: బ‌డ్జెట్ త‌ర్వాత జ‌రిగిన తొలిసారి జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలు..

RBI Monetary Policy: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఎప్పటిలాగానే వడ్డీ రేట్లు..

Updated on: Feb 05, 2021 | 12:23 PM

Budget 2021 – RBI Monetary Policy: న్యూఢిల్లీ: బ‌డ్జెట్ త‌ర్వాత జ‌రిగిన తొలిసారి జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. కీల‌క వ‌డ్డీ రేట్లను అలాగే ఉంచాల‌ని నెలవారీ మానటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా, రివ‌ర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొన‌సాగ‌నుంది. అయితే 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శ‌క్తికాంత దాస్ ముంబైలో జరిగిన ఎంపీసీ మీటింగ్ అనంతరం ఈ రోజు మీడియాతో మాట్లాడనున్నారు. గ‌తేడాది క‌రోనావైరస్ కార‌ణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని.. తిరిగి దానిని గాడిలో పెట్టడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అంతకుముందు వివరించారు. ఈ చర్యల్లో భాగంగా గ‌త మార్చి త‌ర్వాత‌ రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు త‌గ్గించిందన్నారు. బ్యాంకింగ్ రంగం వృద్ధితోపాటు రిటైల్ పెట్టుబడిదారుల కోసం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

చివ‌రిసారి గ‌తేడాది మే 22న రెపో రేటును త‌గ్గించిన రిజ‌ర్వ్ బ్యాంక్‌.. అప్పటినుంచి నుంచి ఎలాంటి మార్పులు చేయ‌డం లేదు. రెపో రేటు అంటే బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీ శాతం. రివ‌ర్స్ రెపో అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న రుణాల‌పై ఇచ్చే వ‌డ్డీ.

Also Read:

India vs England: వరుస వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. వర్కౌటైన కోహ్లీ ప్లాన్.. లంచ్ సమయానికి స్కోరు ఎంతంటే..?

Chakka Jam: ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా చక్కా జామ్.. రైతు సంఘం నేత తికాయత్ కీలక వ్యాఖ్యలు