డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త.. ఆర్‏బీఐ కొత్త రూల్స్… జనవరి 1 నుంచి అమలులోకి

|

Dec 04, 2020 | 6:05 PM

డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త.. ఆర్‏బీఐ కొత్త రూల్స్... జనవరి 1 నుంచి అమలులోకి
Follow us on

డెబిట్ కార్డ్, క్రేడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. డిజిటల్ పేమెంట్స్‏ను పెంచాడానికే ఆర్‏బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కాగా ఇకమీదట కాంటాక్ట్‏లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‏ను పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇకపై రూ.5 వేల వరకు ట్రాన్సాక్షన్లకు పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన పనిలేదని.. ఖాతదారులు లావాదేవీలను సులభంగానే పూర్తి చేయొచ్చని తెలిపింది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఆర్‏బీఐ ప్రకటించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కాంటాక్ట్‏లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో ఇకమీదట కస్టమర్లు సులభంగానే లావాదేవీలు పూర్తిచేసుకోవచ్చు. అదే బాటాలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆర్‏బీఐ మరో విషయాన్ని ప్రకటించింది. ఆర్‏టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‏టీజీఎస్ ద్వారా నగదు పంపిణి చేసుకోవచ్చు.

ఇంకా చదవండి: