మరో వివాదంలో కంగనా రనౌత్, సారీ చెప్పాలంటూ లీగల్ నోటీసు పంపిన గురుద్వారా కమిటీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ వృధ్ధ మహిళ గురించి ఆమె చేసిన ట్వీట్ పై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శనలో..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ వృధ్ధ మహిళ గురించి ఆమె చేసిన ట్వీట్ పై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శనలో పాల్గొనాలంటే ఓ 100 రూపాయలిస్తే ఏ మహిళైనా వస్తుందంటూ కంగనా చేసిన ట్వీట్ చేసింది. ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను ఉద్దేశించి ఆమె మొదట ఇలా వ్యాఖ్యానించి ఆ తరువాత దాన్ని తొలగించింది. తన అనుచిత ట్వీట్ కి గాను ఆమె వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని ఈ కమిటీ చీఫ్ మంజిందర్ సింగ్ సి ర్సా డిమాండ్ చేశారు. ఆమెకు లీగల్ నోటీసును పంపామన్నారు. ఓ రైతు తల్లి, వృధ్ధ మహిళ పట్ల కంగనా ఇలా వ్యాఖ్యానిస్తుందా, రైతుల నిరసనను ఆమె దేశ వ్యతిరేకమైనదిగా చూపుతుందా అని సిర్సా ఆవేశంతో పేర్కొన్నారు.
లోగడ షాహీన్ బాగ్ వద్ద సీఏఎకి వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న 80 ఏళ్ళ వృధ్ధ మహిళ బిల్కిస్ బానో ను కంగనా ఈ వృధ్ద స్త్రీగా పేర్కొంది. (అయితే రైతుల ఆందోళనలో పాల్గొనకుండా బిల్కిస్ ని పోలీసులు మధ్యలోనే అడ్డగించి నిలిపివేశారు). బహుశా నిరసనలో పాల్గొనేందుకు వంద రూపాయలిచ్చ్చి ఆమెను పిలిపించి ఉండవచ్ఛునని కంగనా వ్యాఖ్యానించింది. అటు పంజాబ్ కు చెందిన ఓ లాయర్ కూడా ఆమెను లీగల్ నోటీసు పంపారు. కంగనా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్కిస్ పక్కన ఉన్న మహిళ ఫేక్ మహిళ కాదని ఆయన అన్నారు.