Rasagulla Tea: ఈ రసగుల్లా ఛాయ్‌.. టేస్ట్ చేసి తీరాల్సిందే.. పేరు వింటేనే చప్పరించేయాలనిపిస్తోంది కదూ..

|

Feb 27, 2023 | 6:08 PM

చాయ్.. ఈ పేరు వింటే చాలు.. మనసు చమక్కుమంటుంది. అట్లుంటది మరి వేడి వేడి టీ అంటే.. పొద్దు పొద్దునే నిద్ర లేవగానే కప్పు టీ.. కడుపులో పడకుంటే రోజంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్ చాయ్ లవర్స్..

Rasagulla Tea: ఈ రసగుల్లా ఛాయ్‌.. టేస్ట్ చేసి తీరాల్సిందే.. పేరు వింటేనే చప్పరించేయాలనిపిస్తోంది కదూ..
Rasgulla Tea
Follow us on

చాయ్.. ఈ పేరు వింటే చాలు.. మనసు చమక్కుమంటుంది. అట్లుంటది మరి వేడి వేడి టీ అంటే.. పొద్దు పొద్దునే నిద్ర లేవగానే కప్పు టీ.. కడుపులో పడకుంటే రోజంతా ఏదో కోల్పోయిన ఫీలింగ్ చాయ్ లవర్స్ కి. వేడి వేడి చాయ్.. చిక్కగా గొంతు దిగుతుంటే.. ఆహా.. ఆ హాయే వేరు. భారత దేశంలో టీ కి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అతిథులను ఆత్మీయంగా పలకరించేది టీ.. అలసిన మనసుకు ఉల్లాసాన్నిచ్చేది టీ.. పేదవాడినుంచి అత్యంత ధనవంతుడి వరకూ అందరికీ ప్రియనేస్తం ఈ చాయ్‌. ఇందులో రకాలు కూడా చాలానే ఉన్నాయి. అల్లం టీ నుంచి మసాలా టీ వరకూ ఎన్నో రకాలు. ఏది ఏమైనా సాయం సంధ్యవేళ తేనీటి విందు ఇచ్చే ఆనందమే వేరు. అయితే మనవాళ్లు ఈ టీకి కొత్త కొత్త రుచులు అద్దుతూ సరికొత్త టీలను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇటీవల ఒక్క టీ ఏమిటీ.. ఓరియో మ్యాగీ నుంచి చాక్లెట్‌ ఆమ్లెట్‌ వరకూ ఎన్నో వినూత్న ఫుడ్‌ కాంబినేషన్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి ఓ సరికొత్త టీని టేస్ట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నటుడు ఆశిష్‌ విద్యార్థి కోల్‌కతా రసగుల్లా ఛాయ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. కోల్‌కతా టూర్‌కు వెళ్లిన ఆయన అక్కడ చుముకె చ‌మోక్ ఈట‌రీ వ‌ద్ద టీ తాగేందుకు వెళ్లారు. అక్కడ ఆ టీ స్టాల్‌ అతను ఆశిష్‌కి కొత్తరకం ఛాయ్‌ పరిచయం చేశారు. అతను ఓ మట్టి గ్లాసులో కొన్ని దినుసులు, రసగుల్లా ముక్కను వేసి అనంతరం దానిలో టీ వేసి ఇచ్చాడు. అది టేస్ట్‌ చేసిన ఆశిష్‌ విద్యార్థి ఛాయ్‌ చాలా బావుందంటూ కితాబిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ రుచి కొత్తగా ఉందని, టీలో బ్రెడ్‌ ముంచుకుని తిన్నట్టుగా ఉందని చెప్పారు. అంతేకాదు యూనిక్‌ ఛాయ్‌ అంటూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 4 ల‌క్షల మందికి పైగా వీక్షించారు. అయితే తేనీటి ప్రియులు మాత్రం ఈ ఛాయ్‌పై పెద‌వివిరిచారు. మాఫ్ క‌ర్ధో ప్లీజ్ అని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, కుచ్ భీ అంటూ మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..