ఆకాశంలో అరుదైన దృశ్యం… సూర్యుడి చుట్టూ అల్లుకున్న రంగుల వలయం.. అద్భుతం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

May 27, 2023 | 8:25 PM

శాస్త్రపరిభాషలో వీటినే 22 డిగ్రీ హాలోస్‌ అని కూడా అంటారని వెల్లడించారు. సాధారణంగా భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని చెప్పారు. ఇంద్ర ధనస్సులో ఉండే రంగులతో ఏర్పడిన ఈ వలయం చూడముచ్చటగా కనిపించింది.

ఆకాశంలో అరుదైన దృశ్యం... సూర్యుడి చుట్టూ అల్లుకున్న రంగుల వలయం.. అద్భుతం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Rare Sun Halo
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఆకాశంలో అత్యంత అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం తర్వాత, ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాల నివాసితులు అరుదైన ఖగోళ దృగ్విషయాన్ని చూశారు. సూర్యుడి చుట్టూ ఒక రంగురంగుల వెలుగు వలయం ఏర్పడింది. ఇంద్ర ధనస్సులో ఉండే రంగులతో ఏర్పడిన ఈ వలయం చూడముచ్చటగా కనిపించింది.

ఢిల్లీ వాసులు ఆసక్తిగా ఆ దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్లలో బంధించారు. ఆపై వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అత్యంత అరుదైన ఈ సన్‌ హాలో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

కాగా, మేఘాల్లోని షట్భుజాకార మంచు స్ఫటికాల గుండా సూర్య కిరణాలు వంగి ప్రయాణించడంవల్ల ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రపరిభాషలో వీటినే 22 డిగ్రీ హాలోస్‌ అని కూడా అంటారని వెల్లడించారు. సాధారణంగా భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..