Rare Vulture: ఈద్గా స్మశానవాటికలో అరుదైన రాబందు ప్రత్యక్షం.. బంధించిన అటవీ అధికారులు..

|

Jan 09, 2023 | 8:23 PM

బంధించిన హిమాలయ రాబందును ఇతర పక్షుల నుండి వేరుగా ఆసుపత్రి ఆవరణలో ఉంచినట్లు తెలిపారు. దీని బరువు దాదాపు 8 కిలోలు. వైద్యుల బృందం అరుదైన రాబందును పర్యవేక్షిస్తోంది.

Rare Vulture: ఈద్గా స్మశానవాటికలో అరుదైన రాబందు ప్రత్యక్షం.. బంధించిన అటవీ అధికారులు..
Rare Vulture
Follow us on

ఉత్తరప్రదేశ్: అరుదైన హిమాలయన్ గ్రిఫాన్ రాబందు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాబందుల జాతి అంతరించిపోతున్న క్రమంలో అప్పుడప్పుడు ఇలాంటివి కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అరుదైన తెలుపు రంగు రాబందు.. అక్కడి ఒక స్మశానవాటికలో ఈ పక్షి కనిపించింది. గ్రామస్తులు పక్షిని బంధించారు. దాంతో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఫోటోలు దిగటానికి వారు ఆ పక్షి రెక్కలను బలవంతంగా లాగుతూ హింసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాబందును అటవీ అధికారులు రక్షించి 15 రోజుల క్వారంటైన్ పీరియడ్ కోసం అలెన్ ఫారెస్ట్ జూలోని వెటర్నరీ ఆసుపత్రికి పంపారు. ఇది అత్యంత పురాతనమైనదని, అరుదైనదని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని వయసు వంద ఏండ్లకు పైబడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్‌లోని ఈద్గా స్మశానవాటికలో ఆదివారం సాయంత్రం అత్యంత అరుదైన రాబందు కనిపించింది. దీనిని అరుదైన హిమాలయన్‌ గ్రిఫాన్‌ రాబందుగా జంతుశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో తచ్చడటం చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ రాబందును కొందరు పట్టుకుని బంధించి స్థానిక అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. తెలుపు రంగులో ఉండి చాలా పొడవాటి రెక్కలతో భయపెట్టేలా ఉన్న ఈ రాబందును చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. దీని రెక్కలు దాదాపు 5 అడుగుల వరకు ఉన్నాయని అటవీ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఒక జత హిమాలయ రాబందులు కనిపించినట్టుగా చెప్పారు. బెనజాబర్ ప్రాంతంలో మరో రాబందు ఉందన్నారు. దాని కోసం వేట కొనసాగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

జూ పశువైద్యుడు డాక్టర్ నసీర్ జైదీ మాట్లాడుతూ.. బంధించిన హిమాలయ రాబందును ఇతర పక్షుల నుండి వేరుగా ఆసుపత్రి ఆవరణలో ఉంచినట్లు తెలిపారు. దీని బరువు దాదాపు 8 కిలోలు. వైద్యుల బృందం అరుదైన రాబందును పర్యవేక్షిస్తోంది. జూలో ఇప్పటికే నాలుగు హిమాలయన్ గ్రిఫాన్ రాబందులు ఉన్నాయని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.