Conjoined Twins: రెండు తలలు.. మూడు చేతులతో కవలల జననం.. ఈ విచిత్ర ఘటన ఎక్కడో తెలుసా..

అదివారం ఉదయం ఓ మహిళ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. అనంతరం ఆమెకు పుట్టిన బిడ్డను

Conjoined Twins: రెండు తలలు.. మూడు చేతులతో కవలల జననం.. ఈ విచిత్ర ఘటన ఎక్కడో తెలుసా..
Conjoined Twins

Updated on: Apr 12, 2021 | 12:58 PM

అదివారం ఉదయం ఓ మహిళ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. అనంతరం ఆమెకు పుట్టిన బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు అక్కడి డాక్టర్లు. ఆ మహిళకు అవిభక్త కవలు జన్మించారు. కానీ వారిద్దరు వేరు వేరుగా పుట్టలేదు… కలిసే జన్మించారు. రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. కాసేపటికే వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వారి జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇదంతా వింటుంటే ఏదో బుక్ స్టోరీ చెబుతున్నట్లుగా ఉంది కదూ. కానీ ఇది నిజం. అది కూడా మన దేశంలోనే జరిగింది.

ఒడిశాకు చెందిన ఓ మహిళకు ఆదివారం శస్త్ర చికిత్స చేసి ప్రసవం చేశారు డాక్టర్లు. ఆ మహిళకు రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో అవిభక్త కవలలు జన్మించారు. పుట్టిన కాసేపటికే వీరి పరిస్థితి విషయమించడంతో మెరుగైన వైద్యం కోసం కేంద్రపడ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం వీరిని కటక్ శిశుభవన్‏లో ఉంచారు. జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రం పీడియాట్రిషియన్ దేబాసిన్ సాహు మాట్లాడుతూ. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జన్మిస్తారని.. కవలలిద్దరి ఛాతి, కడుపు అతుక్కొని ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని తెలిపారు. కానీ వీరికి అల్ట్రా సౌండ్ పరీక్షలు చేసిన తర్వాతే మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. శరీరం ఒకటే అయినా.. ఆ చిన్నారి రెండు నోళ్లతో పాలు తాగుతుందని.. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని.. ప్రత్యేక చికిత్స కోసం కటక్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు తరలించామని ఆయన తెలిపారు. కూలి పనులు చేసే తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరుతున్నారు.

Also Read:  రవితేజ ‘ఖిలాడి’ టీజర్ వీరలెవల్.. బ్యాక్‏గ్రౌండ్ మ్యూజిక్‏తోనే చింపేశాడు.. మరింత డేంజరస్‏గా మాస్ మాహారాజ్..

మళ్లీ పోటీపడుతున్న కమల్, రజనీ.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత సీన్ రిపీట్.. అభిమానులకు ఇక పండగే..