ఈ భూమ్మిద ఎన్నోరకాల జాతుల పాములు ఉన్నాయి. అయితే కొన్ని అరుదైన పాములు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇప్పడు తాజాగా ఓ అరుదైన పాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో దర్శనమిచ్చింది. అల్బినో కోబ్రా అనే తెల్లని రంగులో ఉన్న పాము ఓ రైస్ మిల్ లో కనిపించడం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వారు వెంటనే పోలీస్ డిపార్ట్ మెంట్ తో కలిసి పనిచేస్తున్న నయిమ్ షైక్ అనే పాములు పట్టే నిపుణుడ్ని పిలిపించారు. అక్కడికి వచ్చిన షైక్ ఆ పామును బయటికి తీశాడు. ఆ తర్వాత అటవీ అధికారులకు ఫోన్ చేయగా వారు వచ్చి.. ఆ పామును అడవిలో వదిలేశారు. వాస్తవానికి ఈ తెల్లని అల్బినో కోబ్రా కనిపించడం చాలా అరుదు. ఆ ప్రాంతంలో ఈ పాము కనిపించడం ఇదే మొదటిసారి. దాని పొడవు నాలుగు ఫీట్లు 9 సెంటీమీటర్లు ఉంది. అయితే ఇలాంటి పాములు సాధారణంగా అల్బినిజమ్ అనే వ్యాధి రావడం వల్లే తెల్లగా మారుతాయని నయిమ్ షైక్ తెలిపాడు. వాటి ఆవాసా ప్రాంతాలు తరగిపోవడం వల్లే ఇలాంటి పాములు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు.