Baba Ramdev: బాబా రామ్‌దేవ్ వివరణపై స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వివాదాన్ని ముగిద్దామంటూ ట్వీట్

|

May 24, 2021 | 8:59 AM

యోగా గురువు రామ్‌దేవ్ తన ప్రకటనను ఉపసంహరించుకుని, ఈ అంశంపై వివాదాన్ని నిలిపివేసిన విధానం ప్రశంసనీయమని మంత్రి హర్ష వర్ధన్ కొనియాడారు.

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ వివరణపై స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వివాదాన్ని ముగిద్దామంటూ ట్వీట్
Minister Harsh Vardhan On Baba Ramdev
Follow us on

Minister Harsh Vardhan on Baba Ramdev: కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ యోగా గురువు రామ్‌దేవ్ వివరణపై స్పందించారు. అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా బాబా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుని, ఈ అంశంపై వివాదాన్ని నిలిపివేసిన విధానం ప్రశంసనీయమని మంత్రి హర్ష వర్ధన్ కొనియాడారు. ఆయన పరిపక్వత కలిగి గొప్పతనం వెల్లడైందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదన్నారు.

“యోగా గురువు రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుని, ఈ సమస్యపై వివాదాన్ని నిలిపివేసిన విధానం ప్రశంసనీయం, అతని పరిపక్వతను చూపిస్తుంది. భారత ప్రజలు కోవిడ్‌ను ఎలా ఎదుర్కొన్నారో ప్రపంచానికి చూపించాలి. -19. అయితే, మా విజయం ఖచ్చితంగా ఉంది! ” అంటూ కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.


ఇదిలావుంటే, అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ యోగా గురు రాందేవ్‌బాబాకు ఆదివారం ఘాటుగా లేఖ రాశారు. వివాదాస్పద వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు కూడా దెబ్బ తీశారంటూ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని, ఈ పోరాటాన్ని నీరుగార్చవద్దని కోరారు.

అంతకుముందు, ‘అల్లోపతి పనికిమాలిన వైద్యం’ అంటూ రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై శనివారం భారత వైద్యమండలి (ఐఎంఏ) తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వైద్యుల నిరసన చూశాక.. ఆ వ్యాఖ్యలు రాందేవ్‌బాబా చేసినవి కాదంటూ హరిద్వార్‌ పతంజలి యోగపీఠం ట్రస్టు ఖండించింది. వైద్యుల ఒత్తిడి, కేంద్ర మంత్రి లేఖ ఫలించి యోగా గురు వివరణ ఇచ్చుకునే పరిస్థితి నెలకొంది. ‘అల్లోపతి వైద్యంపై నేను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నా. అన్నిరకాల వైద్యాలను నేను గౌరవిస్తాను. ముఖ్యంగా అల్లోపతి ఎంతోమంది జీవితాలను కాపాడుతోంది. ఈ విషయం ఇంతటితో ముగించాలని అనుకొంటున్నా’ అంటూ యోగా గురు రాందేవ్‌బాబా ఆదివారం కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ లేఖకు బదులిస్తూ ట్వీట్‌ చేశారు.

Read Also….  కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్