Stage collapses in farmers protest: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన మహాపంచాయత్ కార్యక్రమంలో అకస్మాత్తుగా స్టేజీ కుప్పకూలింది. దీంతో స్టేజీపై ఉన్న భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. హర్యానాలోని జింద్‌లో బుధవారం మహాపంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేయూ నేత రాకేష్ తికాయత్‌తో పాటు పలు సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో దానిపైనున్న వారంతా కిందపడిపోయారు. దీంతో తికాయత్‌తోపాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#WATCH | The stage on which Bharatiya Kisan Union (Arajnaitik) leader Rakesh Tikait & other farmer leaders were standing, collapses in Jind, Haryana.
A ‘Mahapanchayat’ is underway in Jind. pic.twitter.com/rBwbfo0Mm1
— ANI (@ANI) February 3, 2021
Also Read:
Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..