Rajnath Singh: పీఓకే ఎప్పటికీ భారత్‌లోని భాగమే.. పాకిస్థాన్‌కు చురకలంటించిన రాజ్‌నాథ్ సింగ్..

ఉగ్రవాదం విషయంపై భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన భారతీయ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు చురకలంటించారు. కశ్మీర్ విషయాలపై మాట్లాడే బదులు సొంత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని బదులిచ్చారు.

Rajnath Singh: పీఓకే ఎప్పటికీ భారత్‌లోని భాగమే.. పాకిస్థాన్‌కు చురకలంటించిన రాజ్‌నాథ్ సింగ్..
Rajnath Singh

Edited By:

Updated on: Jun 27, 2023 | 6:21 AM

ఉగ్రవాదం విషయంపై భారత్, అమెరికా చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన భారతీయ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు చురకలంటించారు. కశ్మీర్ విషయాలపై మాట్లాడే బదులు సొంత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని బదులిచ్చారు. జమ్మూలోని జాతీయ భద్రత అంశంపై మాట్లాడిన ఆయన.. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం పెద్ద విషయమేమి కాదన్నారు. కశ్మీర్‌ను తరచుగా ప్రస్తవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ముందుగా మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండని సూచించారు. భారతదేశంలో ఉన్నవారు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారో పాకిస్థాన్ అక్రమణలో ఉన్నవారు చూస్తున్నారని చెప్పారు.

వాస్తవానికి పీఓకే అనేది ఎప్పటికీ కూడా భారత్‌లోని అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అక్రమంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల పాకిస్థాన్‌కు దానిపై ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు భారత్-అమెరికాలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదులకు కేంద్రంగా మారకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరు దేశాలు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనపై పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. ఇది తప్పుదోవ పట్టించేలా ఉందంటూ చెప్పింది. అందుకే పాకిస్థాన్‌కు భారత్ మళ్లీ సమాధానమిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us