Rajiv Gandhi Assassination: జైల్లో ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు..

రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనను ప్రియాంక కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని , తన తండ్రిని ఎందుకు చంపారని..

Rajiv Gandhi Assassination: జైల్లో ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు..
Nalini

Updated on: Nov 13, 2022 | 10:34 PM

రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనను ప్రియాంక కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని , తన తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించినట్టు తెలిపారు. అంతేకాదు.. దోషులుగా కాకుండా తమను బాధితులుగా చూడాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని సహా ఐదుగురు నిందితులు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన నళినిచ శ్రీహరన్ దంపతులు మీడియాతో మాట్లాడారు. తమను దోషులుగా కాకుండా .. బాధితులుగా చూడాలన్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు ఇప్పటికి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తునట్టు తెలిపారు. తనను జైల్లో ప్రియాంకగాంధీ కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని వెల్లడించారు. తన తండ్రిని ఎందుకు చంపారో చెప్పాలని ప్రియాంక ప్రశ్నించినట్టు చెప్పారు నళిని. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పానని , కాని ఆ వివరాలు వెల్లడించబోనని తెలిపారు.

‘‘జైల్లో ప్రియాంకగాంధీ నన్ను కలిశారు. తన తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారు. ఆమెతో మాట్లాడిన విషయాలు నేను మీకు వెల్లడించలేను. తన తండ్రిని గుర్తు చేసుకొని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. వాళ్ల కుటుంబానికి చాలాసార్లు క్షమాపణలు చెప్పాం. అవకాశం వస్తే తప్పకుండా గాంధీ కుటుంబాన్ని కలుస్తాం . కాని ఇప్పుడు ఆ అవసరం లేదనుకుంటా.’’ అని నళిని అన్నారు.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం జైలు నుంచి విడుదలయ్యారు నళిని. 32 ఏళ్ల పాటు ఆమె రాజీవ్‌ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు. తన భర్త శ్రీహరన్‌ను ట్రిచ్చి స్పెషల్‌ క్యాంప్‌ నుంచి బయటకు తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు నళని.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us