Rajasthan Minister: మా రాష్ట్రంలో పురుషులు ఎక్కువ.. అందుకే అత్యాచారాలు అధికం.. మంత్రి షాకింగ్ కామెంట్స్

|

Mar 11, 2022 | 1:53 PM

దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా నేరాలు చేసే వారిలో మార్పు రావడం లేదు. అయితే ఇలాంటి సమయాల్లో బాధితులకు అండగా ఉండాల్సిన నాయకులే...

Rajasthan Minister: మా రాష్ట్రంలో పురుషులు ఎక్కువ.. అందుకే అత్యాచారాలు అధికం.. మంత్రి షాకింగ్ కామెంట్స్
Dharival
Follow us on

దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా నేరాలు చేసే వారిలో మార్పు రావడం లేదు. అయితే ఇలాంటి సమయాల్లో బాధితులకు అండగా ఉండాల్సిన నాయకులే విచక్షణ కోల్పోతున్నారు. అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్రమవుతున్నారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు(Sensational Comments) చేశారు. మంత్రి వ్యాఖ్యలపై స్థానికుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధమని సదరు మంత్రి చెప్పడం గమనార్హం. రాజస్థాన్‌(Rajasthan) అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్రానికి చెందిన శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శాంతి ధరివాల్‌(Minister Dharival) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌ పురుషుల రాష్ట్రం అన్న ఆయన.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఆత్యాచారాల్లో తమ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

మంత్రి మాటలపై స్థానికంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ ట్వీట్‌ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నారు కాబట్టే రాష్ట్రంలోని మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి మంత్రులు ఉంటే మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు.

మరోవైపు ఈ అంశంపై తాను నోరు జారానని, క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సదరు మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా శాంతి ధరివాల్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ధరివాల్ ఇలా మాట్లాడుతున్నప్పుడు.. అసెంబ్లీలో కూర్చున్న కొంతమంది ఎమ్మెల్యేలు నవ్వడం కొసమెరుపు.

Also Read

Revanth meets Jaggareddy: ఉప్పు-నిప్పు ఏకమయ్యాయి.. సీఎల్పీలో కీలక సన్నివేశం.. జగ్గారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి

Shane Warne: స్వదేశం చేరుకున్న షేన్‌ వార్న్‌ పార్థీవ దేహం.. లక్షమంది అభిమానుల సమక్షంలో ఆరోజునే అంత్యక్రియలు..

CM KCR Yadadri Visit: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..!