
ప్రతీ రోజు మాదిరిగానే ఆ రైతు ఓ ఉదయం తన పొలం పనులకు బయల్దేరాడు. ఇక పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్తుండగా.. అతడికి బంగారు వస్తువులు కనిపించాయి. అవి చూడగానే అనుమానం వచ్చి.. బావి దగ్గరకు వెళ్లి.. అందులోకి తొంగి చూడగా ఊహించని దృశ్యం కనిపించింది. అంతే! అతడు దెబ్బకు భయంతో పరుగో పరుగు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా షేర్గర్ గ్రామంలో ఉన్న ఓ పొలం బావిలో ప్రేమికుల మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. మృతుల్లో యువతి అదే గ్రామ నివాసితురాలు కాగా.. యువకుడు బేవార్‌కు చెందినవాడు. ఇద్దరు చేతులకు చున్నీ కట్టి ఉండటం.. బావి గట్టుపై బ్రాస్‌లెట్లు, ఆ పక్కనే ఉన్న చెప్పుల జతలు బట్టి.. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఆ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మరోవైపు యువతి తండ్రి రెండు రోజుల కిందట మిస్సింగ్ కంప్లయింట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..