పని మనిషి నడుస్తుంటే జారిపడుతున్న కరెన్సీ నోట్లు! ఏంటా అని చెక్‌ చేసి చూస్తే.. షాక్‌

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని కమాన్ పట్టణంలో ఓ ఇంటి పనిమనిషి బబితా జాతవ్‌ దొంగతనం చేసి పట్టుబడింది. ఇంటి యజమాని స్నానం చేస్తున్న సమయంలో బీరువా నుండి రూ.55,000 దొంగిలించింది. ఆమె దుస్తుల నుండి నోట్లు జారిపడటంతో యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పని మనిషి నడుస్తుంటే జారిపడుతున్న కరెన్సీ నోట్లు! ఏంటా అని చెక్‌ చేసి చూస్తే.. షాక్‌
Rajastan Police

Updated on: May 18, 2025 | 5:59 PM

ఓ ఇంట్లో ఓ మహిళ దాదాపు రెండేళ్లుగా పనిచేస్తుంది. రోజూలానే శనివారం కూడా పనికొచ్చి, ఇంట్లో పని చేస్తోంది. అయితే ఇంటి యజమాని స్నానానికి వెళ్లింది. ఇంతలో బెడ్‌ రూమ్‌లో ఏదో శబ్దం అయింది. ఏంటా అని వచ్చి చూస్తే.. పని మనిషి బీరువా ముందు నిల్చోని ఉంది. ఇక్కడేం చేస్తున్నామ్‌ ఆమె అడిగితే.. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటా ఆమె శరీరం నుంచి నోట్లు జారిపడుతూ ఉన్నాయి. దీంతో యాజమాని షాక్‌ అయింది.

ఈ ఘటన రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని కమాన్ పట్టణంలోని సుర్జావాగ్ కాలనీలో ఉన్న బన్సాల్ వాటర్ సప్లయర్ కంపెనీ యజమాని విష్ణు బన్సాల్ ఇంట్లో జరిగింది. అసలింతకీ ఆ పని మనిషి వంట్లో నుంచి కరెన్సీ నోట్లు ఎందుకు జారీ పడుతున్నాయంటే..? యాజమాని స్నానానికి వెళ్లగానే పని మనిషి బబితా జాతవ్ బీరవాలోని నోట్ల కట్టలను తీసుకొని తన డ్రెస్సులో పెట్టుకుంది.

అప్పుడే యాజమాని వచ్చి ప్రశ్నించడంతో కంగారులో సరిగ్గా సర్దుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంటే.. ఆమె కదలికలకు ఆ నోట్లు జారి కిందపడ్డాయి. దీంతో అనుమానం వచ్చిన యాజమాని ఆమెను చెక్‌ చేయగా.. ఆమె వద్ద రూ.55 వేలు దొరికాయి. వెంటనే యాజమాని పోలీసులకు సమాచారం అందించి, పనిమనిషి చేసిన నిర్వాకం గురించి చెప్పి, వారికి అప్పగించింది. గతంలో కూడా ఇలాగే తమ ఇంట్లో డబ్బులు మాయం అయ్యాయని, అది కూడా ఈ పనిమనిషి పనే అయి ఉంటుందని యాజమాని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి