SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ

|

Apr 19, 2022 | 9:09 AM

State Bank of India: బ్యాంకులో ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.11 కోట్ల నాణేలు మాయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మాయమైన మొత్తం నగదు

SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్‌బీఐ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ
Sbi
Follow us on

State Bank of India: బ్యాంకులో ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.11 కోట్ల నాణేలు మాయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మాయమైన మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగానే ఉన్నందున ఏకంగా సీబీఐనే రంగంలోకి దింపారు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లోని మెహందీపుర్‌ బాలాజీకి చెందిన ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. కోట్ల విలువైన నాణేలు మాయం కావడంపై సీబీఐ రంగంలోకి దిగింది. కనిపించకుండా పోయిన మొత్తం రూ.3 కోట్లపైనే ఉండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సీబీఐతో విచారణ జరిపించాలంటూ రాజస్తాన్‌ (Rajasthan) హైకోర్టును అభ్యర్థించింది. ఇప్పటికే రాజస్థాన్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఎస్‌బీఐ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న రాజస్థాన్ కోర్టు దర్యాప్తు చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ మేరకు రాజస్థాన్‌ పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు సోమవారం దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. మెహందీపుర్‌ బాలాజీ శాఖలో నగదు నిల్వల విషయంలో తేడాలు వచ్చాయి. దీంతో ఈ శాఖలో నగదు లెక్కించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ బాధ్యతను జైపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు వెండర్‌కు అప్పగించారు. నాణేలకు సంబంధించి రూ.2 కోట్ల విలువైన 3 వేల సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మిగతా రూ.11 కోట్ల నాణేలు మాయమైనట్టు లెక్కింపు సందర్భంగా తేలింది. అయితే.. కొంతమంది వ్యక్తులు గతేడాది ఆగస్టులో నగదు లెక్కింపును నిలిపేయాలంటూ లెక్కించే సిబ్బందిని బెదిరించినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read:

Credit Card: క్రెడిట్ కార్డు ఊబిలో చిక్కుకున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించి ఖర్చు తగ్గించుకోండి..

Elon Mask: కనీసం సొంతిల్లు లేదంటున్న టెస్లా సీఈవో.. ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాడంట..!