
రాజస్థాన్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. గెలుపుపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ధీమాతో ఉన్నాయి. 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ నిలిచిపోయింది.
అయితే, చెదరుమదరు ఘటనలు మినహా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల కల్లా 68 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ప్రముఖులు, ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎవరికివారుగా, తమ విజయం ఖాయమని ధీమాతో ఉన్నారు రాజకీయ పార్టీల నేతలు. తెలంగాణతో పాటు డిసెంబర్ మూడోతేదీన రాజస్థాన్ ఫలితాలు వెలువడనున్నాయి.
విజయంపై అటు కాంగ్రెస్ నేతలు , ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో పోటీపడుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పట్టుదలగా ప్రచారం సాగించగా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, విశ్వనాథ్ మోవార్, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, రాజసథాన్ విపక్ష నేత రాజేంద్ర రాథోడ్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నచ్చచెప్పడంతో టిక్కెట్లు లభించని పలువురు నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఇరు పార్టీలకు చెందిన 45 మంది తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఐదు రాష్ట్రాల రిజల్ట్స్‌తో పాటు డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సికార్‌లో అల్లర్లు జరిగాయి. రెండువర్గాల మధ్య వాగ్వాదం మొదలై, అది రాళ్లదాడికి దారితీసింది. రాళ్లదాడితో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, అల్లరిమూకలను చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ఫతేపూర్ DSP రామ్‌ప్రసాద్ చెప్పారు. అటు ధోల్‌పూర్‌లో కూడా ఇదే తరహా ఘర్షణలు జరిగాయి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు రాహుల్‌గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లో పోలింగ్ జరుగుతుంటే, చవకైన గ్యాస్ సిలిండర్ కోసం, వ్యవసాయదారులకు రుణమాఫీ, OPS కోసం ఓటేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేశారని బీజేపీ ఆరోపించింది. ఆయనపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలంటూ రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరింది. అలాగే రాహుల్‌గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని కూడా బీజేపీ ఆ ఈసీ కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…