Indian Railways: కొత్త సంవత్సరంలో రైల్వేశాఖ బిగ్ ప్లాన్.. ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

2026లో భారతీయ రైల్వే ఆధునిక రైళ్ల ప్రారంభానికి నాంది పలకనుంది. ఇప్పటికే వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభానికి సిద్దం కాగా.. వచ్చే ఏడాది మరిన్ని అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక బుల్లెట్ ట్రైన్ల తయారీ కూడా జరుగుతోంది.

Indian Railways: కొత్త సంవత్సరంలో రైల్వేశాఖ బిగ్ ప్లాన్.. ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..
Namo Bharat

Updated on: Nov 29, 2025 | 4:50 PM

Trains In India: భారత్‌లో రైళ్ల ప్రయాణం చేసేవారు ఎక్కువ. ఇక బాగా దూరపు ప్రయాణాలు చేసేవారు సౌకర్యవంతంతగా ఉండే ట్రైన్ జర్నీనే ఇష్టపడతారు. కుటుంబంతో సహా ప్రయాణాలు చేసేవారు కూడా ట్రైన్ జర్నీని కంఫర్ట్‌ కోసం ఎంచుకుంటారు. ఒకప్పుడు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వందే భారత్ లాంటి లగ్జరీ ట్రైన్స్ కూడా ప్రయాణికుల కోసం రాగా.. త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. వీటితో పాటు అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మరికొన్ని ట్రైన్లు కూడా కొత్త సంవత్సరంలో రానున్నాయి. వీటి రాకతో భారత రైల్వేల స్వరూపమే మారనుంది. వాటి వివరాలు ఏంటి? అనేది ఇందులో చూద్దాం.

వందే భారత్ స్లీపర్ రైళ్లు

కొత్త సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ లగ్జరీతో కూడిన ప్రయాణం చేసే సౌకర్యం స్లీపర్ రైళ్లతో లభించనుంది. ఇది భారత రైల్వే వ్యవస్థలో ఒక గేమ్ ఛేంజర్‌గా చెబుతున్నారు. రానున్న కొన్ని ఏళ్లల్లో దాదాపు 200 వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. BEML 10 వందే భారత్ రైళ్లను ICFతో కలిసి తయారుచేస్తుండగా.. ఇండో-రష్యన్ జాయింగ్ వెంచర్‌లో కీనెట్ సంస్థ 10 రైళ్లను, ఇక టిటాగఢ్-బెల్ కన్సార్టియం 80 వందే భారత్ స్లపీర్ ట్రైన్లను తయారుచేస్తుంది.

అమృత్ భారత్ రైళ్లు

ఇక భారత రైల్వే సామాన్యుల కోసం అమృత్ భారత్ రైళ్లను తీసుకురావాలని చూస్తోంది. 2023 నుంచి అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మెరుగైన సౌకర్యాలతో 2.0 రైళ్లను ప్రవేశపెడుతోంది. కొత్త ఏడాదిలో 3.0 రైళ్లను కూడా ఏసీ కోచ్‌లతో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అమృత్ భారత్ రైళ్లు 130 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి. పుష్ ఫుల్ టెక్నాలజీ కూడా వీటిల్లో ఉంటుంది. రానున్న కొన్నేళ్లల్లో మరిన్ని అమృత్ భారత్ రైళ్లు రానున్నాయి.

బల్లెట్ ట్రైన్స్

ఇక బుల్లెట్ ట్రైన్స్‌ను సొంతంగా తయారుచేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. రెండు హైస్పీడ్ రైళ్ల తయారీకి BEML కు ICF సహకారంతో ఒక ప్రాజెక్ట్ లభించింది. ఇప్పటికే ప్రాధమిక డిజైన్లు కూడా రూపొందించారు. 2027 ప్రారంభంతో మొదటి బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక ఇప్పటికే ఇండియన్ రైల్వే తొలి హైడ్రోజన్ సెల్ పవర్డ్ రైలును తయారుచేసింది. హర్యానాలోని జంద్, సోనిపట్ మార్గంలో త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ఈ రైలు 110 కిలోమీటరల్ వేగంతో ప్రయాణిస్తుంది.