RailTel Launches Wi-Fi Plans: రైల్వే పిఎస్‌యు రైల్‌టెల్ వై-ఫై సేవను లాంఛనంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4,000 రైల్వే స్టేషన్లలో వినియోగదారులకు టాప్ స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. రైల్‌టెల్ ఇప్పటికే దేశంలోని 5,950 కి పైగా స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్, యాక్టివ్ కనెక్షన్ ఉన్న ఎవరైనా ఓటీపీ ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు వై-ఫై ఉచితంగా ఒక రోజుకు 30 నిమిషాలు మాత్రమే 1 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఆ తరువాత కూడా ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే ఎంతో కొంత చెల్లించాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో రైల్‌టెల్ తాజాగా సరికొత్త ప్రీపెయిడ్ వై-ఫై సేవలను ప్రారంభించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అనేక ఛాన్స్‌లు ఉన్నాయి. వినియోగదారులు నామమాత్రపు రుసుముతో 34 ఎంబీపీఎస్ వరకు గరిష్ట వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.
రైల్‌టెల్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి..
రైల్‌టెల్ వై-ఫై ప్లాన్స్‌లలో చాలా రకాలుగా ఉన్నాయి. 10 రోజుల వాలిడిటీతో రూ .10 కి 5 జీబీ డేటా, రూ. 15 రూపాయలకు ఒక రోజు వాలిడిటీతో 10 జీబీ డేటా, రూ. 20 రూపాయలకు 5 రోజుల వాలిడిటీతో 10 జీబీ డేటా, 5 రోజుల వాలిడిటీతో 20 జీబీ డేటా, రూ .30 రూపాయలకు 10 రోజుల వాలిడిటీతో 20 జీబీ డేటా, 10 రోజుల వాలిడిటీతో రూ. 40 రూపాయలకు 50 జీబీ డేటా. ఇలా 30, 60, 70 జీబీల లెక్కన ఆఫర్లు ఉన్నాయి.
రైల్‌టెల్ సిఎండి పునీత్ చావ్లా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని 20 స్టేషన్లలో ప్రీపెయిడ్ వై-ఫై ను ప్రయోగాత్మకంగా పరీక్షించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తాము ఈ పథకాన్ని భారతదేశం అంతటా 4,000 కి పైగా స్టేషన్లలో ప్రారంభించామన్నారు. ప్రతిఒక్కరికీ ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రారంభించాలని తాము భావిస్తున్నామన్నారు. ఏ వినియోగదారుడైనా సరే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇ-వాలెట్ సహాయంతో వీటి ప్లాన్స్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.
Also read: