‘బొమ్మలు కాదు, పరీక్షలపై చర్చ ముఖ్యం’, రాహుల్ గాంధీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2020 | 3:00 PM

ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ దేశం బొమ్మల (టాయ్స్) హబ్ గా మారాలంటూ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..తన ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇప్పుడు టాయ్స్ కన్నా నీట్, జేఈఈ పరీక్షలపై చర్చ ముఖ్యమని..

బొమ్మలు కాదు, పరీక్షలపై చర్చ ముఖ్యం, రాహుల్ గాంధీ
Follow us on

ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ దేశం బొమ్మల (టాయ్స్) హబ్ గా మారాలంటూ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..తన ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇప్పుడు టాయ్స్ కన్నా నీట్, జేఈఈ పరీక్షలపై చర్చ ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కోవిడ్ తరుణంలో ఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయానికి   నిరసన తెలపాలని లక్షలాది విద్యార్థులు యోచిస్తుంటే ఈ పరీక్షలపై చర్చ జరపకుండా ‘ఖిలోనా (ఆటబొమ్మలపై) పే చర్చా’ ఏమిటని ఆయన ట్వీటించారు. అంతే కాదు, ‘మన్ కీ నహీ.. స్టూడెంట్స్ కీ బాత్’ అని హ్యాష్ ట్యాగ్ కూడా రాహుల్ జత చేశారు.’పరీక్షా పే చర్చా’ అన్నది ముఖ్యం అన్నారు.

ఈ దేశంలో పిల్లల అభివృధ్దికి టాయ్స్ చాలా అవసరమని, వాటి ఉత్పత్తిలో ఇండియా గ్లోబల్ లీడర్ కావాలని మోదీ వ్యాఖ్యానించారు. ఇండియా టాయ్స్ హబ్ గా మారాలి.. గ్లోబల్ టాయ్ మార్కెట్ 7 లక్షల కోట్ల విలువైనదని, ఈ మార్కెట్లో ఇండియాకు తక్కువ వాటా ఉందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని రాహుల్ అన్నారు.