Rahul Gandhi: ట్రంప్ చెప్పింది నిజమే.. అది మోదీకి తప్ప అందరికీ తెలుసు.. రాహుల్ సంచలన కామెంట్స్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25శాతం సుంకాలు విధించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు పతనానికి చేరుకున్నాయని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్ చెప్పింది నిజమేనని.. బీజేపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు.

Rahul Gandhi: ట్రంప్ చెప్పింది నిజమే.. అది మోదీకి తప్ప అందరికీ తెలుసు.. రాహుల్ సంచలన కామెంట్స్..
Rahul Gandhi On Trump Comments

Updated on: Jul 31, 2025 | 6:45 PM

ట్రంప్ టారీఫ్‌ చర్చనీయాంశంగా మారింది. భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇండియా ఆర్థికవ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తోంది. ఇదే సమయంలో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ట్రంప్ అన్నది కరెక్టేనని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్.. రష్యాతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా నాకు అవసరం లేదు. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మొత్తం కూల్చేసుకున్నా నాకు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ అన్నది వాస్తవమేనని.. ఈ విషయం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు తప్ప ప్రపంచంలోని అందరికీ తెలుసన్నారు. ట్రంప్ ఈ నిజాన్ని చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు.

బీజేపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్థిక , రక్షణ, విదేశాంగ విధానాలను బీజేపీ నాశనం చేసిందన్నారు. మోదీ కేవలం అదానీ కోసమే పనిచేస్తారని విమర్శించారు. అదానీకి సహాయం చేయడం కోసం దేశాన్ని పణంగా పెట్టారని మండిపడ్డారు. ‘‘భారత్ పాక్ యుద్ధం తన వల్లే ఆగిందని ట్రంప్ 32 సార్లు అన్నారు. 5 భారతీయ విమానాలు కూలిపోయాయని కూడా చెప్పారు. ఇప్పుడు ట్రంప్ 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ వీటన్నింటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ పార్లమెంట్ ప్రసంగంలో ట్రంప్, చైనా పేర్లను ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ నిలదీశారు. ఓ వైపు పహల్గామ్ దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ లంచ్ చేస్తే.. మోదీ మాత్రం గొప్ప విజయమంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ అబద్ధాలు ఆపి.. దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, రాజీవ్ శుక్లా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత ఆర్థికవ్యవస్థ పతనం కాలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని రాజీవ్ శుక్లా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..