Bharat Jodo Yatra: “భగవద్గీతను ఆదర్శంగా తీసుకొనే ఈ యాత్ర.. ఉత్తర భారంతంలోనూ ఆదరణ”

|

Jan 08, 2023 | 7:36 PM

భారత్‌ జోడో యాత్ర సౌత్‌ కంటే ఉత్తర భారతంలోనే ఎక్కువ సక్సెస్‌ అవుతోందని అన్నారు రాహుల్‌గాంధీ. భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఎలాంటి ఫలితం ఆశించకుండా తాను యాత్ర చేపట్టినట్టు తెలిపారు రాహుల్‌.

Bharat Jodo Yatra: భగవద్గీతను ఆదర్శంగా తీసుకొనే ఈ యాత్ర.. ఉత్తర భారంతంలోనూ ఆదరణ
Congress leader Rahul Gandhi during the party's 'Bharat Jodo Yatra', in Panipat, Friday, Jan. 6, 2023
Follow us on

భారత్‌ జోడో యాత్ర తనకు ఓ తపస్సులాంటిదన్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌. యాత్రకు హర్యానాలో ఊహించినదానికంటే ఎక్కువ స్పందన ప్రజల నుంచి వస్తోందని అన్నారు. యాత్ర నుంచి తాను ఎటువంటి రాజకీయ లబ్దిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. వేలాదిమంది ప్రజలు తమ అభిప్రాయాలను తనతో పంచుకున్నారని తెలిపారు రాహుల్‌. ఉత్తరభారతంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని రాహుల్‌ స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రజల నుంచి స్పందన లభిస్తుందని అన్నారని , కాని ఉత్తర భారతం లోనే ఎక్కువ స్పందన లభిస్తోందని అన్నారు రాహుల్‌.

“దక్షిణాదిలో యాత్రకు స్పందన ఉంది కానీ మహారాష్ట్రకు రాగానే రెస్పాన్స్‌ ఉండదని అన్నారు. కాని దక్షిణాది రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో ఎక్కువ రెస్సాన్స్‌ వచ్చింది. మహారాష్ట్ర బాగుంది కాని హిందీ బెల్ట్‌లో బాగుండదని అన్నారు. కాని మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాక బ్రహ్మాండమైన స్పందన లభించింది. హర్యానాలో బీజేపీ
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికి ప్రజలు బాగా ఆశీర్వదించారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

హర్యానా లోని కురుక్షేత్రలో ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. అంతకుముందు కర్నాల్‌లో కూడా యువత రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. ఎముకలు కొరికే చలిలో షర్ట్‌ లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుపై డాన్స్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు రాహుల్‌. భారత్‌ జోడో యాత్ర ఆ భయాలను దూరం చేసేందుకు కృషి చేస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి