పంజాబ్ కాంగ్రెస్ లో రేగిన అసమ్మతి చిచ్చు నేపథ్యంలో మాజీ మంత్రి..పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు బుధవారం ఢిల్లీలో పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళనపై ఆయన ఆమెతో చర్చించినట్టు తెలుస్తోంది. ఆమెతో తాను చాలాసేపు చర్చించానని సిద్దు ఆ తరువాత ట్వీట్ చేశారు. ఇంతకు మించి వివరించలేదు. ఈ భేటీ అనంతరం ప్రియాంక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి బయల్దేరి వెళ్లారు. సిద్దును కలిసేందుకు మొదట రాహుల్ గాంధీ నిరాకరించడంతో ఆయన ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. సిద్దుతో మీటింగ్ ఏదీ లేదని, మీరెందుకిలా రాద్దాతం చేస్తున్నారని రాహుల్ నిన్న తన ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతూ మీడియానుద్దేశించి అన్నారు. నిజానికి రాహుల్ తో సమావేశం కావాలని ఢిల్లీ నుంచి తమకు పిలుపు అందిందని సిద్దు కార్యాలయం ఇటీవల తెలిపింది. మరి ఆయన ఎందుకు ఈ భేటీకి నిరాకరించారో తెలియడంలేదు. మరోవైపు రాహుల్, ప్రియాంక ఇద్దరూ కొన్ని రోజులుగా పంజాబ్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతున్నారు.
ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, రాజ్యసభ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా వంటివారితో రాహుల్ సుదీర్ఘ సమావేశాలు జరిపారు. 2019 లో పంజాబ్ కేబినెట్ నుంచి సిద్దు రాజీనామా చేశారు. లోకల్ బాడీస్ పోర్టుఫోలియో శాఖను తన నుంచి తప్పించడంతో ఆయన వైదొలిగారు. అప్పటి నుంచి ఆయనకు, సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. సీఎం అవినీతికి పాల్పడుతున్నారని సిద్దు వర్గం ఆరోపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.