మోదీజీ ! కరోనాపై ఇంత నిర్లక్ష్యమా ? రాహుల్ గాంధీ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Mar 03, 2020 | 6:12 PM

ప్రపంచ వ్యాప్తంగా జనాలను, ప్రభుత్వాలను బెంబేలెత్తిస్తున్న కరోనాపై  ప్రధాని మోదీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో మీ సోషల్ మీడియా ఖాతాలను అప్పగిస్తానంటూ హాస్యాస్పద ప్రకటనలు చేసి ఈ దేశ సమయాన్ని వృధా చేయడాన్ని మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు  . కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సింగపూర్ ప్రధాని లీ హుసేన్ లూంగ్ ఏం చెప్పారో చూడాలంటూ ఆయన చేసిన […]

మోదీజీ ! కరోనాపై ఇంత నిర్లక్ష్యమా ? రాహుల్ గాంధీ ఫైర్
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా జనాలను, ప్రభుత్వాలను బెంబేలెత్తిస్తున్న కరోనాపై  ప్రధాని మోదీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో మీ సోషల్ మీడియా ఖాతాలను అప్పగిస్తానంటూ హాస్యాస్పద ప్రకటనలు చేసి ఈ దేశ సమయాన్ని వృధా చేయడాన్ని మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు  . కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సింగపూర్ ప్రధాని లీ హుసేన్ లూంగ్ ఏం చెప్పారో చూడాలంటూ ఆయన చేసిన ప్రసంగం తాలూకు వీడియోను రాహుల్ షేర్ చేశారు.

(తన సోషల్ మీడియా  ఖాతాలను మహిళా దినోత్సవం రోజయిన మార్చి 8 న మహిళలకు అప్పగిస్తానని మోదీ తన ట్విటర్లో పేర్కొన్న సంగతి విదితమే). అయితే ప్రజలకు నవ్వు పుట్టించే ఈవిధమైన చర్యలు తగవని రాహుల్ అన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఒక నిజమైన నాయకుడు ఈ సంక్షోభాన్ని, ఎలా ఎదుర్కోవాలో, దేశ ఆర్థికవ్యవస్థను ఎలా రక్షించుకోవాలో అన్న విషయాన్ని ఆలోచిస్తాడని అన్నారు. కరోనా వైరస్ మన దేశ ప్రజలకు, ఎకానమీకి పెను ముప్పు అంటూ గత నెల 12 న తను చేసిన ట్వీట్ ను ఆయన ట్యాగ్ చేశారు. కరోనాపై ఆందోళన అవసరం లేదని, దీని నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని మోదీ ప్రకటించిన విషయం గమనార్హం. అయితే ఆయన ప్రకటనను, సింగపూర్ ప్రధాని చేసిన సుదీర్ఘమైన వివరణను రాహుల్ గాంధీ పోల్చారు.